Vishnu Vishal : తండ్రి మాట్లాడుతుంటే స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో
తమిళ హీరో విష్ణు విశాల్ గతంలో రానా నటించిన ‘అరణ్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తమిళ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు తెలుగు మార్కెట్ కోసం కూడా....
Vishnu Vishal : తమిళ హీరో విష్ణు విశాల్ గతంలో రానా నటించిన ‘అరణ్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తమిళ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు తెలుగు మార్కెట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం విష్ణు విశాల్ FIR సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా తమిళ్, తెలుగులో రిలీజ్ అవ్వనుంది. తెలుగులో ఈ సినిమా రవితేజ రిలీజ్ చేయనున్నారు. ఉగ్రవాదం, పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పోలీస్ అధికారి, విష్ణు విశాల్ తండ్రి రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ ఈవెంట్ లో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ మాట్లాడుతూ.. ‘‘మొదటిసారి ఓ సినిమా ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు విష్ణుని చూస్తుంటే గర్వంగా ఉంది. తన వల్లే ఈ రోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నా కొడుకు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వారందరికీ నా కృతజ్ఞతలు. కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఎంతోమంది వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా మా వాడికి సహాయం చేశారు. ముఖ్యంగా అభిమానులు తనని ఎంతో ఆదరించారు. అందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఇటీవల నేను ‘ఎఫ్ఐఆర్’ సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని కొడుకు గురించి గొప్పగా చెప్తి మాట్లాడారు.
Sunitha : నెటిజన్ నోటి దూల.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత
దీంతో అయన కొడుకు గురించి చెప్తుండటంతో విష్ణు విశాల్ ఎమోషనల్ అయిపోయి స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.