Sunitha : నెటిజన్‌ నోటి దూల.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

తాజాగా తెలంగాణ ముచ్చింతల్లో అతిపెద్ద రామానుజ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడికి భర్తతో కలిసి వెళ్లిన సునీత ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోకి...

Sunitha :  నెటిజన్‌ నోటి దూల.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

Sunitha

Singer Sunitha :  చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీలని ట్రోల్ చేస్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ కొంతమంది మాత్రం ట్రోల్ చేసిన వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్లకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయని సునీత ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

సింగర్ సునీత ఓ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన భర్తతో హ్యాపీగా గడుపుతూ మంచి లైఫ్ ని లీడ్ చేస్తుంది ప్రస్తుతం. తన భర్తతో ఉన్న ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సునీత. తాజాగా తెలంగాణ ముచ్చింతల్లో అతిపెద్ద రామానుజ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడికి భర్తతో కలిసి వెళ్లిన సునీత ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mahesh Babu: మౌంటెన్ డ్యూ కొత్త యాడ్‌తో మహేష్.. బుర్జ్‌ ఖలీఫా పై నుంచి కిందకి బైక్‌తో స్టంట్..

ఈ ఫోటోకి చాలా మంది కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ ఈ ఫొటోకి ”కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఈమె సొంతం, ధనం ఆయన సొంతం. గానం ఈవిడది, దర్జా అతనిది.” అని పోస్ట్ చేశాడు. అయితే దీనికి చాలా మంది నెటిజన్స్ సునీతని సపోర్ట్ చేస్తూ గట్టిగానే సమాధానమిచ్చారు. సింగర్ సునీత కూడా ఈ కామెంట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సునీత..”నోటి దూల మీది, నీ భారం భూమిది.” అని కామెంట్ చేసింది.

Capture

చాలా మంది సునీతకి సపోర్ట్ చేస్తూ అతన్ని ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెట్టడంతో మరో కామెంట్ లో.. ” నా ప్రియమైన స్నేహితులకి.. నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్ ద్వారా నా కోసం నిలబడే నా శ్రేయాభిలాషులు ఇంతమంది ఉన్నారని తెలుసుకొని గర్వపడుతున్నాను. ఎన్నో చూసాను, చూస్తూనే ఉన్నాను. అయినా ఎప్పుడూ ఎవరిని ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం. అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉన్న వాళ్ళని దేవుడే కాపాడాలి.” అని ఆ నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ కామెంట్ పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Capture1

 

 

Rana : క్లైమాక్స్ లేని రానా ‘1945’ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్