Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రాకకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు వస్తున్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో చాలా రోజుల తరువాత మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రాకకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు వస్తున్నారంటే?

Waltair Veerayya Second Song Time Locked

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో చాలా రోజుల తరువాత మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రొమాన్స్‌కు డేట్ ఫిక్స్ చేసిన వీరయ్య!

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘బాస్ పార్టీ’కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌గా ‘శ్రీదేవి చిరంజీవి’ అనే రొమాంటిక్ పాటను రిలీజ్ చేసేందుకు వాల్తేరు వీరయ్య అండ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ పాటను డిసెంబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, తాజాగా ఈ పాటను రిలీజ్ చేసే టైమ్‌ను కూడా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

Waltair Veerayya: వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య.. తగ్గేదే లే అంటోన్న సీనియర్స్!

ఈ రొమాంటిక్ సాంగ్‌ను డిసెంబర్ 19న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.