Aryan Khan : 15 ఏళ్లకే డ్రగ్స్ తీసుకున్నా..ఆర్యన్ ఖాన్ పిల్లోడు – సోమీ ఆలీ

సోమీ ఆలీ..పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై ఆమె స్పందించారు. అసలు డ్రగ్స్ వాడితే ఏమవుతుంది ? ఎలా ఉంటుందని పిల్లవాడు తెలుసుకోలేడా ? అంటూ ప్రశ్నించారు.

Aryan Khan : 15 ఏళ్లకే డ్రగ్స్ తీసుకున్నా..ఆర్యన్ ఖాన్ పిల్లోడు – సోమీ ఆలీ

Aryankhan

Somy Ali On Instagram : ముంబాయిలో షిప్ డ్రగ్స్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆర్యన్ ఖాన్ కు బాలీవుడ్ కు చెందని ప్రముఖుల్లో కొంతమంది మద్దతు తెలియచేస్తున్నారు. ఇప్పటికే సల్లూ భాయ్, పూజా భట్, హృతిక్ రోషన్ సపోర్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు అయిన అనంతరం రాత్రికి రాత్రి షారూఖ్ ఇంటికి సల్మాన్ ఖాన్ వెళ్లడం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ మాజీ నటి సోమీ ఆలీ మద్దతు తెలియచేసే విధంగా ప్రకటన ఇచ్చారు. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా డ్రగ్స్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు పోస్టు చేశారు.

Read More : Aryan Khan: ఒకవైపు పాపం పిల్లాడనే సింపతీ.. మరోవైపు సెటైర్లు!

పాక్ కు చెందిన సోమీ ఆలీ..పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై ఆమె స్పందించారు. అసలు డ్రగ్స్ వాడితే ఏమవుతుంది ? ఎలా ఉంటుందని పిల్లవాడు తెలుసుకోలేడా ? అంటూ ప్రశ్నించారు. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ..రాసుకొచ్చారు. పిల్లలు డ్రగ్స్ వాడడం సహజం, పెద్ద విచిత్రంగా ఏం అనిపించలేదని తెలిపారు. వ్యభిచారం, డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా తొలగించలేమని, అందుకే వాటిని క్రిమినల్ జాబితాలో నుంచి తొలగించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : Mumbai Drug Bust Case : ఆర్యన్‌కు షాక్.. మళ్లీ బెయిల్ నిరాకరణ..!

తాను కూడా 15 ఏళ్ల వయస్సులో డ్రగ్స్ తీసుకోవడం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఆందోళన్ మూవీ తీస్తున్న సమయంలో…దివంగత నటి దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేయడం జరిగిందని సోమీ ఆలీ తెలిపారు. డ్రగ్స్ వాడకంపై ఆర్యన్ ను ఓ పావులా వాడుకొంటోందని, అతను వేదనకు గురవుతున్నాడని తెలిపింది. పరిశ్రమలో షారూఖ్ ఖాన్ కు అత్యంత సన్నిహిత వ్యక్తి ఎవరు అంటే..ఫరాఖాన్ అని చెబుతుంటారు. గౌరీ ఖాన్ బర్త్ డే సందర్భంగా…ఆమె స్పెషల్ ట్వీట్ చేశారు. ఓ తల్లి చేసే ప్రార్థన కొండల్ని…అయినా..కదిలిస్తుంది సుముద్రాలను అయినా..చీలుస్తుందన్నారు. గత వారం రోజుల్లో…తాను వ్యక్తిగతంగా…చూసిన శక్తివంతురాలైన ఆ తల్లికి..స్త్రీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలియచేశారు. సోమీ ఆలీ చేసిన వ్యాఖ్యలపై ఇతర నటీ నటులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Somy Ali (@realsomyali)