Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్.. చరణ్.. చిరు.. నాగ్.. అంతా వాళ్ల నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీగా ఉన్నారు. నెక్ట్స్ మేమ ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పేశారు.

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

Telugu Stars

Telugu Stars: ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్.. చరణ్.. చిరు.. నాగ్.. అంతా వాళ్ల నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీగా ఉన్నారు. నెక్ట్స్ మేమ ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పేశారు. కాని ఎటూ తేల్చకుండా ఫ్యాన్స్ ను ఊగిసలాటలో పెట్టిన స్టార్స్ కూడా లేకపోలేదు. అయితే, ఒక సినిమా కంప్లీట్ కాకముందే మరో సినిమా ఓపెనింగ్ చేసుకుంటూ పోతున్న స్టార్స్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. కాని ఒక సినిమా చేస్తూ.. రెండు మూడు సినిమాలు అనౌన్స్ చేసి.. తరువాత ఏ సినిమా స్టార్ట్ చేస్తాడో తెలియకుండా ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజన్ లో పెట్టేస్తున్నారు కొంత మంది తెలుగు స్టార్ హీరోలు. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ పుష్ప తరువాత ఏ సినిమా చేస్తాడు అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Aishwarya Rajesh: ప్యూర్ హోమ్లీ లుక్‌లో ఐశ్వర్య.. ఫోటోలు!

అల.. వైకుంఠపురములో సినిమాకంటే ముందు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ చేయాలి అనుకున్నాడు బన్నీ. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు కాని డ్రాప్ అయ్యి.. అలవైకుంఠంతో పాటు.. పుష్ప పార్ట్ 1 చేసేశాడు. కాని పార్ట్2 ఎప్పుడూ అనేది ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. పుష్ప పార్ట్ 1 తరువాత ఐకాన్ సినిమా సెట్స్ ఎక్కేస్తాడు బన్నీ అంటున్నారు. అంతేనా.. అక్కడితో ఆగకుండా ఐకాన్ కాదు.. మరికొన్ని కథలు వింటున్నాడు. ఏదైనా ఒక మూవీ చెయ్చొచ్చు అని మరో మాట వినిపిస్తోంది. కాని బన్నీ మాత్రం ఇప్పటి వరకూ అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది.

Bigg Boss 5: షన్నుతో రిలేషన్‌పై తల్లి వార్నింగ్.. సిరి బాయ్‌ఫ్రెండ్ ఏమన్నాడంటే

ఇక విజయ్ దేవరకొండది కూడా అదే పరిస్థితి. లైగర్ మూవీ కరోనా పరిస్థితుల వల్ల రెండేళ్లుగా సాగదీస్తునే ఉన్నారు. రీసెంట్ గా స్పీడప్ అయ్యింది టైగర్ షూటింగ్. ఈ సినిమా తరువాత సుకుమార్ తో సినిమా అన్నాడు విజయ్ దేవరకొండ. అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. అటు శివ నిర్వాణకు కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు రౌడీ హీరో. అయితే లైగర్ కంప్లీట్ కావస్తున్నా.. తన నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు విజయ్. స్టార్ హీరోలు పక్క ప్లానింగ్ తో వెళ్తుంటే.. ఆ ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

Film Release Clash: సౌత్ వర్సెస్ నార్త్, నీ ప్రతాపమో.. నా ప్రతాపమో!

టాలీవుడ్ యంగ్ స్టార్స్ చాలా మంది ఇలానే చేస్తున్నారు. చిన్న పెద్దా హీరోలో పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తుంటే.. స్టార్ డమ్ ఉండి కూడా రానా.. వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఏం చేయకుండా కామ్ గా చూస్తున్నారు. రానా విరాటపర్వం రిలీజ్ గురించి దిగులుగా ఉన్నాడు. పవర్ స్టార్ తో భీమ్లానాయక్ లో స్క్రీన్ శేర్ చేసుకున్నాడు. బాబాయి వెంకటేష్ తో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. కాని పక్కాగా తన స్టార్ డమ్ పెరిగే విధంగా సరైన ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకూ అనౌన్స్ చేయలేదు రానా. ఇప్పటి వరకూ కొత్త సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అటు వరుణ్ తేజ్ కూడా అంతే.. బాక్సీంగ్ బ్యాగ్ గ్రైండ్ తో గని సినిమా చేస్తున్న వరుణ్.. నెక్ట్స్ ఏంటీ అనేది ఆలోచించకుండా గనీ మీదనే కాంన్సంట్రేట్ చేశాడు. ఇలా స్టార్డమ్ ఉండీ కూడా ప్లానింగ్ లేకుండా ఇబ్బందుల్లో పడుతున్నారు స్టార్స్.