AP Cinema Ticket Price Issue : ఏపీ సినిమా టికెట్ రేట్లపై రచయిత బుర్ర సాయిమాధవ్ వ్యాఖ్యలు

రచయిత సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏపీ సినిమా టికెట్ల అంశంపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన సినిమా టికెట్ ధరల్ని ఉద్దేశిస్తూ...........

AP Cinema Ticket Price Issue : ఏపీ సినిమా టికెట్ రేట్లపై రచయిత బుర్ర సాయిమాధవ్ వ్యాఖ్యలు

Sai Madhav

 

AP Cinema Ticket Price Issue :   ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరల వ్యవహారంలో ప్రభుత్వానికి సినీ ప్రముఖుల మధ్య దూరం ఏర్పడింది. చాలా మంది సినీ ప్రముఖులు ఈ విషయాన్నీ బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. సినీ ప్రముఖులే కాక, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిట్, థియేటర్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆర్జీవీ ఈ అంశంపై ట్విట్టర్ లో చర్చకి తెరలేపారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ సినీ రచయిత బుర్ర సాయి మాధవ్ మాట్లాడారు.

Raai Laxmi : డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసిన లక్ష్మి‌రాయ్

రచయిత సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏపీ సినిమా టికెట్ల అంశంపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన సినిమా టికెట్ ధరల్ని ఉద్దేశిస్తూ.. ”సులభ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్లడానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్లోనికి వెళ్లడమనేది చాలా బాధాకరమైన విషయం” అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరింతమంది సినీ ప్రముఖులు కూడా బయటకి చెప్పకపోయినా సన్నిహితుల వద్ద ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై జనవరి 10న ఆర్జీవీ మంత్రి పేర్ని నానితో మీట్ అవుతుండటంతో ఈ మీటింగ్ చాలా ఆసక్తికరంగా మారింది. ఆర్జీవీ అయినా ఈ సమస్యకి పరిష్కారం సాధిస్తాడేమో చూడాలి.