Xiaomi 13 Ultra Launch : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Ultra Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు? ఏయే ఫీచర్లతో రానుందో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.

Xiaomi 13 Ultra Launch : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Ultra to launch globally on April 18, check out expected price, specifications and more

Xiaomi 13 Ultra Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఏప్రిల్ 18న లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే, ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి అనేక పుకార్లు వినిపించాయి. ఎట్టకేలకు షావోమీ (Xiaomi 13 Ultra) మోడల్ లాంచ్ కానున్నట్టు కంపెనీ రివీల్ చేసింది.

ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా షావోమీ 13 ఫోన్ ఫీచర్లను ప్రదర్శించనుంది. పుకార్ల ప్రకారం.. షావోమీ ఫోన్ Pad 6, చైనాలో Xiaomi 13 అల్ట్రా లాంచ్‌తో పాటు రానుంది. షావోమీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను ధృవీకరించింది. షావోమీ 13 Ultra ఇప్పటి వరకు కంపెనీ అత్యంత premkuym ఆఫర్‌గా రానుంది. గతంలో, షావోమీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా భారత మార్కెట్లో 13 Proని లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.79,900 వద్ద లాంచ్ అయింది.

షావోమీ 13 Ultra ఫీచర్లు (అంచనా) :
షావోమీ 13 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. గరిష్టంగా 16GB RAM, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ పైన MIUI 14 లేయర్డ్‌తో Android 13 OSని రన్ అవుతుంది. Xiaomi 13 అల్ట్రా లైకా-బ్రాండెడ్ కెమెరా లెన్స్‌లను కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

Xiaomi 13 Ultra to launch globally on April 18, check out expected price, specifications and more

Xiaomi 13 Ultra to launch globally on April 18, check out expected price, specifications

Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్‌‌‌కు ‘4/20’ లాస్ట్ డేట్.. ఈ తేదీనే మస్క్ ఎందుకు ఎంచుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

50MP సోనీ IMX989 సెన్సార్, మరో మూడు 50MP సెన్సార్‌లతో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీల కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఇతర ఫీచర్లలో 90W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,900mAh బ్యాటరీతో రానుంది.

షావోమీ 13 అల్ట్రా డిజైన్ (అంచనా) :
షావోమీ 13 అల్ట్రా డిజైన్ విషయానికి వస్తే.. కెమెరా మాడ్యూల్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ నాలుగు సెన్సార్ల మాదిరిగా కనిపించే కొంచెం లార్జ్ రౌండ్ కెమెరా మాడ్యూల్ హౌసింగ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ లీకైన రెండర్‌లు పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, కర్వడ్ ఎడ్జ్‌లను కూడా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైట్ సిరామిక్, బ్లాక్ లెదర్ ఫినిష్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. షావోమీ 13 అల్ట్రా భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఎలాంటి సమాచారం లేదు. ప్రపంచవ్యాప్తంగా షావోమీ అభిమానులు మాత్రం కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Thomson 4K TV : 65 అంగుళాలతో 4K స్మార్ట్‌టీవీ.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!