Thomson 4K TV : 65 అంగుళాలతో 4K స్మార్ట్‌టీవీ.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Thomson 4K TV : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? థామ్సన్ ఇండియా (Thomson India) నుంచి 65 అంగుళాలతో సరికొత్త 4K స్మార్ట్‌టీవీ వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ టీవీ ధర ఎంతంటే?

Thomson 4K TV : 65 అంగుళాలతో 4K స్మార్ట్‌టీవీ.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Thomson India launches 65-inch 4K smart TV with Google TV OS for Rs 43,999

Updated On : April 12, 2023 / 5:39 PM IST

Thomson 4K TV : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ ఇండియా (Thomson India) బ్రాండ్ లైసెన్సీ (SPPL) భారత మార్కెట్లో (Google TVOS)తో 65-అంగుళాల స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే ఉన్నప్పటికీ, ఈ టీవీ ధర కేవలం 43,999 మాత్రమే. అదే స్క్రీన్ సైజు కలిగిన చాలా స్మార్ట్ టీవీల ధర రూ. 50వేల కన్నా ఎక్కువగా ఉన్నాయి. 65-అంగుళాల థామ్సన్ ఇండియా టీవీ కంపెనీ ఓత్ ప్రో మ్యాక్స్ సిరీస్‌లో భాగమని చెప్పవచ్చు.

డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీకి సపోర్టు ఇచ్చే 40W స్పీకర్లతో క్లౌడ్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో, థామ్సన్ తన ఆల్ఫా సిరీస్ కింద రెండు సరసమైన టీవీలను లాంచ్ చేసింది. 24-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 6,499, టాప్-ఎండ్ 40-అంగుళాల వేరియంట్ ధర కేవలం రూ. 13,499గా ఉంటుంది. ఈ కొత్త టీవీ 65-అంగుళాలతో 2023 ఎడిషన్ మూడవ మోడల్‌గా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

థామ్సన్ కంపెనీ ఇప్పటికే 65-అంగుళాల టీవీని విక్రయిస్తోంది. అయితే, QLED ప్యానెల్‌తో వస్తుంది. లేటెస్ట్ మోడల్ IPS ప్యానెల్‌ను కలిగి ఉంది. సాధారణంగా అద్భుతమైన కలర్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. అయితే, QLED డిస్‌ప్లేలు ఉన్న టీవీల మాదిరిగా పవర్‌ఫుల్ కాదు.

Read Also : Apple Retail Store : ముంబైలో ఫస్ట్ ఆపిల్ రిటైల్ స్టోర్.. ఈ 22 బ్రాండ్లకు నో ఎంట్రీ బోర్డు.. ఆపిల్ కొత్త రూల్ ఎందుకు పెట్టిందో తెలుసా?

డిజైన్ పరంగా చూస్తే.. కొత్త థామ్సన్ 65-అంగుళాల టీవీ థిక్ బేస్ కలిగి ఉంది. సరికొత్త ఫీచర్లను కలిగిన స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్న కస్టమర్లు ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు. స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో కూడిన టీవీలు సాధారణంగా పేలవమైన స్పీకర్లను కలిగి ఉంటాయి. ఆ టీవీలలో పోర్ట్ ఆప్షన్ కూడా లిమిట్ కావచ్చు.

Thomson India launches 65-inch 4K smart TV with Google TV OS for Rs 43,999

Thomson India launches 65-inch 4K smart TV with Google TV OS for Rs 43,999

కొత్త 65-అంగుళాల టీవీలో Google TV, Dolby Digital, Dolby Atmos, 2GB RAM, 16GB స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయని థామ్సన్ కంపెనీ తెలిపింది. ముఖ్యంగా, డిస్‌ప్లే, సన్నని బెజెల్‌లను కలిగి ఉంటుంది. వ్యూ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు 4K రిజల్యూషన్‌ను అందిస్తుంది. అదనపు ఫీచర్లలో Dolby Vision HDR 10 Plus, Dolby Digital Plus, DTS TrueSurroundకి సపోర్టు అందిస్తుంది. వైర్‌లెస్ కనెక్టివిటీలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi బ్లూటూత్ ఉన్నాయి.

థామ్సన్ 65-అంగుళాల 4K TV Google TV OS ద్వారా రన్ అవుతుంది. Android, iOS యూజర్లు (Google TV) యాప్‌తో డివైజ్ రన్ చేయొచ్చు. ఈ ఫోన్‌లోని YouTube యాప్‌తో, మీరు కాస్టింగ్ స్క్రీన్ ఆప్షన్ ఉపయోగించి నేరుగా టీవీలో కంటెంట్‌ను ప్లే చేయవచ్చు. అదేవిధంగా, ప్యాకేజీ 65-అంగుళాల QLED మోడల్‌తో అదే టీవీ రిమోట్‌ను కలిగి ఉంటుంది. టీవీ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ వంటి షార్ట్‌కట్ బటన్‌లు కూడా ఉన్నాయి.

కొత్త థామ్సన్ 65-అంగుళాల టీవీని ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఏప్రిల్ 13న విక్రయించనుంది. ప్రారంభ కస్టమర్‌లు ఏప్రిల్ 17 వరకు ఆఫర్‌లను పొందవచ్చు. ప్రస్తుతం, YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 5వేలు పైనా ఎక్కువ ఆర్డర్లు చేసిన వినియోగదారులకు అదే ఆఫర్ DBS బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్‌‌‌కు ‘4/20’ లాస్ట్ డేట్.. ఈ తేదీనే మస్క్ ఎందుకు ఎంచుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!