Redmi 10A : రెడ్‌మి నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

Redmi 10A : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ Redmi నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.

Redmi 10A : రెడ్‌మి నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

Xiaomi Sub Brand Redmi 10a Budget Smartphone India Launch Today Expected Price, Specifications

Redmi 10A : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ Redmi నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. అదే.. Redmi 10A స్మార్ట్ ఫోన్.. ఇండియాలో సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది. నెల క్రితమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ అయింది. Redmi 10A బడ్జెట్ ఫోన్.. ఇప్పటికే Amazon వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనుంది. Redmi 10A స్మార్ట్ ఫోన్.. వాటర్డ్ డౌన్ వెర్షన్‌గా రానుంది. MediaTek Helio G25 ప్రాసెసర్, 13-MP ప్రైమరీ కెమెరాతో పాటు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. Redmi 10A బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో ఏయే ఫీచర్లు ఉన్నాయి.. మార్కెట్లో ఈ డివైజ్ ధర ఎంత ఉండొచ్చునేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. స్పెసిఫికేషన్‌లను చూద్దాం.

Redmi 10A ధర (అంచనా) :
భారత మార్కెట్లో Redmi 10 స్మార్ట్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు అనేది కంపెనీ రివీల్ చేయలేదు. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో అధికారికంగా రిలీజ్ అయింది. అక్కడ Redmi 10A చైనాలో (4GB RAM + 64GB), 4GB RAM + 128GB, 6GB RAM + 128GB వేరియంట్‌లతో సహా మొత్తం 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇక బేస్ వేరియంట్ డివైజ్ చైనా మార్కెట్లో రూ. 649 యువాన్ (దాదాపు రూ. 7,700) నుంచి ధర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లీక్ రిపోర్టుల ప్రకారం.. Redmi 10A (4GB+64GB) స్టోరేజ్ వేరియంట్ రూ.9999 ప్రారంభ ధర ఉండనున్నట్టు అంచనా. 3GB RAM+32GB స్టోరేజ్ తో వచ్చే బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.8,999గా ఉంటుందని అంచనా. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఫైనల్ ధర ఎంత ఉండొచ్చు అనేది రివీల్ కానుంది.

Xiaomi Sub Brand Redmi 10a Budget Smartphone India Launch Today Expected Price, Specifications (1)

Xiaomi Sub Brand Redmi 10a Budget Smartphone India Launch Today Expected Price, Specifications

Redmi 10A స్పెసిఫికేషన్‌లు :
Redmi 10A బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 720×1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G25 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ఇందులో స్టోరేజీ పెంచుకునే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. ఇక Redmi 10A స్మార్ట్ ఫోన్.. Android 11 ఆధారిత MIUI 12.5 కస్టమ్ స్కిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కెమెరా ముందు భాగంలో.. Redmi 10A 13MP కెమెరాతో పాటు LED ఫ్లాష్‌ కలిగి ఉంది. సెల్ఫీల కోసం.. ముందు భాగంలో 5-MP కెమెరా ఉంది. ఫోన్ బాక్స్‌లో 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వెనుకకు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్ GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Redmi 10 Budget Phone : 50MP డ్యుయల్ కెమెరాతో Redmi కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?