Redmi 10 Budget Phone : 50MP డ్యుయల్ కెమెరాతో Redmi కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Redmi 10 Budget Phone : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 50MP డ్యుయల్ కెమెరా సెటప్‌తో Redmi 10 ఇండియాలో లాంచ్ అయింది.

Redmi 10 Budget Phone : 50MP డ్యుయల్ కెమెరాతో Redmi కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Redmi 10 Budget Phone Redmi 10 Launched In India With A Snapdragon 680 Soc And 50mp Dual Camera Setup (1)

Redmi 10 Budget Phone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 50MP డ్యుయల్ కెమెరా సెటప్‌తో Redmi 10 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త రెడ్ మి బడ్జెట్ ఫోన్.. కేవలం రూ. 13వేలకే అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లో గత ఏడాదిలో లాంచ్ అయిన Redmi 10 Prime స్మార్ట్ ఫోన్ తర్వాత కొత్త రెడ్ మి స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో ఇది రెండోది. ఈ కొత్త Redmi 10 స్మార్ట్ ఫోన్ Redmi 10C రీబ్యాడ్జ్ వెర్షన్ గా వచ్చింది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఈ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ అయింది. Redmi 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అందించారు. ఫోన్ డిస్‌ప్లే కూడా పొడవుగా ఆకర్షణీయంగా ఉంది. భారత మార్కెట్లో Redmi 10 ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఇండియాలో Redmi 10 ధర ఎంతంటే? :
Xiaomi బ్రాండ్ Redmi 10 స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వచ్చింది. ఇందులో బేస్ మోడల్‌లో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.10,999గా ఉండనుంది. అలాగే 6GB + 128GB వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 12,999గా నిర్ణయించారు. కరేబియన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. HDFC బ్యాంక్ కార్డ్ కస్టమర్లు రూ. 1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్చి 24 నుంచి ఈ కొత్త Redmi 10 బడ్జెట్ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Redmi 10 Budget Phone Redmi 10 Launched In India With A Snapdragon 680 Soc And 50mp Dual Camera Setup

Redmi 10 Budget Phone Redmi 10 Launched In India With A Snapdragon 680 Soc And 50mp Dual Camera Setup

స్పెసిఫికేషన్లు- ఫీచర్లు ఇవే :
Redmi 10 స్మార్ట్ ఫోన్.. 6.7-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాతో పాటు వాటర్-డ్రాప్ నాచ్ కూడా ఉంది. 720 x 1600 పిక్సెల్‌ HD+ రిజల్యూషన్‌తో 20.6:9 రేషియో కలిగి ఉంది. స్క్రీన్ 400 నిట్స్ గరిష్టంగా 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ కిందిభాగంలో స్నాప్‌డ్రాగన్ 680 SoCని కలిగి ఉంది. Adreno 610 GPUతో వచ్చిన ఈ ఫోన్ 6GB RAM కలిగి ఉంది. ఇంటర్నల్ స్టోరేజీ 128GB వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD ద్వారా స్టోరేజీ సపోర్టు చేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6000 mAh బ్యాటరీని అమర్చారు.

బాక్స్ వెలుపల 10W ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది. ఫోన్ వెనుకవైపు, డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా.. 50MP ప్రధాన కెమెరా సెన్సార్, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫోన్ ప్లాస్టిక్ బ్యాక్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సింగిల్ స్పీకర్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వచ్చింది. ఇక ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

Read Also : Chinese Smartphone Makers : భారత్‌లో ఫోన్ల తయారీకి 3 చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల ప్లాన్..!