Suchitra: త్రిష ప్రేమించింది విజయ్ ని కాదు.. ఆ హీరో పెళ్లి కూడా చెడగొట్టాడు.. సంచలన కామెంట్స్ చేసిన సింగర్ సుచిత్ర
విజయ్-త్రిష రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ సుచిత్ర(Suchitra).
Singer Suchitra shocking comments on Vijay-Trisha relationship
- విజయ్- త్రిష వ్యవహారంలోకి సీజర్ సుచిత్ర
- త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదంటూ వ్యాఖ్య
- టీవీ ఛానల్ లో ఆసక్తికర కామెంట్స్
Suchitra: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల వ్యవాహారం ఎంత సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన సతీమణి సంగీత కోర్టుకెక్కింది. అయితే, విజయ్ నుంచి ఆమె విడాకులు కోరడానికి ఆమె చెప్పిన కారణం ఇంకా సంచలనం అయ్యింది. విజయ్ ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ ఆమె డివోర్స్ పిటీషన్ లో తెలిపింది. దాంతో, ఆ హీరోయిన్ ఎవరా అంటూ సెర్చింగ్ మొదలయ్యింది.
ఈనేపథ్యంలోనే స్టార్ బ్యూటీ త్రిష పేరు బాగా వైరల్ అయ్యింది. విజయ్- త్రిషల మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ, ఈ వార్తలపై ఎవరు స్పందించలేదు. తాజాగా, విడాకుల సమయంలో సంగీత అలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే, విజయ్ డివోర్స్ వ్యవహారం, విజయ్- త్రిష రిలేషన్ లో ఉన్నారు అంటూ వస్తున్న వార్తలపై సింగర్ సుచిత్ర(Suchitra) స్పందించింది.
ఇటీవల ఓ టీవీ ఛానెల్లో లో ఆమె ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ..”సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదు. ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు.. కానీ త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదు. ఆమె ఉదయనిధి స్టాలిన్ ను ప్రేమిస్తుందని సమాచారం. ఆమధ్య వ్యాపారవేత్తతో వరుణ్ మనియన్ తో త్రిష కి జరిగిన ఎంగేజ్మెంట్ ని కూడా ఉదయనిధి స్టాలిన్ క్యాన్సిల్ చేయించాడు’అంటూ చెప్పుకొచ్చింది సుచిత్ర. దాంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాట వైరల్ అవుతున్నాయి.అయితే, సుచిత్ర చెప్పిన ఈ వార్తల్లో నిజం ఎంత అని తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి విజయ్ విడాకుల వార్త, త్రిష న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
