Apple iPhone 16e : ఆపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17e ఎంట్రీతో భారీగా పడిపోయిన iPhone 16e ధర, ఎంతంటే?
Apple iPhone 16e : ఆపిల్ పాత ఐఫోన్ 16e మోడల్ ఒక్కసారిగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. భారత మార్కెట్లో ఐఫోన్ 17e మోడల్ లాంచ్ అయిన వెంటనే ఈ పాత ఐఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఇలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 16e
- ఆపిల్ ఐఫోన్ 17e రాగానే గత జనరేషన్ ఐఫోన్ 16e ధర భారీ తగ్గింపు
- భారత మార్కెట్లో ఐఫోన్ 16e రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్
- విజయ్ సేల్స్‌లో రూ. 52,390కి లిస్టింగ్, రూ. 7,510 ఫ్లాట్ డిస్కౌంట్
Apple iPhone 16e : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ అప్గ్రేడ్లతో ఐఫోన్ 17e లాంచ్ అయింది. చౌకైన ధరలో ఐఫోన్ 17e వచ్చిన వెంటనే ప్రస్తుత మార్కెట్లో లభ్యమయ్యే లాస్ట్ జనరేషన్ మోడల్ ఐఫోన్ 16e కూడా భారీ తగ్గింపు పొందింది.
ఈ ఐఫోన్ ఆన్లైన్లో రూ. 11వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అయ్యే యూజర్లు లేదా ఫస్ట్ ఐఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్. అయితే, ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఆపిల్ ఐఫోన్ 16e డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e రూ.59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో రూ.52,390కి లిస్ట్ అయింది. రూ.7,510 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Apple iPhone 17e : అత్యంత చౌకైన ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేసిందోచ్, ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర మీ బడ్జెట్లోనే!
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌లో 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 16e అల్యూమినియం బిల్డ్‌తో వస్తుంది. ఫేస్ ఐడీకి సపోర్టు ఇస్తుంది. ఇంకా, ఈ హ్యాండ్సెట్ ఇమేజ్ క్లీనప్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. రైటింగ్ టూల్స్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. ఐఫోన్ 16e ఫీచర్లలో USB-C పోర్ట్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ అందిస్తుంది.
