Download Aadhaar Card : అర్జెంట్‌గా ఆధార్ కావాలా? మీ వాట్సాప్‌లోనే క్షణాల్లో కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!
Download Aadhaar Card : ఆధార్ కార్డు అవసరం పడితే ఏం చేయాలి? ఎలా పొందాలి? ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లాలా? అవసరం లేదు. మీ ఫోన్ వాట్సాప్ లోనే ఈజీగా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఆధార్ అత్యవసరంగా అవసరం పడితే ఎలా పొందాలి?
- ఆధార్ కార్డు మీ దగ్గర లేకుంటే ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
- ఇంట్లోనే మీ మొబైల్ ద్వారా ఇలా ఈజీగా ఆధార్ పొందవచ్చు
- ఇలా చేశారంటే మీ వాట్సాప్ లోనే ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేయొచ్చు
Download Aadhaar Card : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్. ప్రతిఒక్కరికి ఎక్కడో ఒక చోట ఆధార్ అవసరం పడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా ఎమర్జెన్సీ విషయాలకు కూడా ఆధార్ అవసరం పడొచ్చు. అప్పుటికప్పుడు ఆధార్ కార్డు పొందడం చాలా కష్టమే. కొంతమంది ముందుగానే డౌన్ లోడ్ చేసి పెట్టుకుంటారు. మరికొందరు అలా చేయరు.
ఇలాంటి సందర్భాల్లో ఆధార్ కార్డు వెంటనే పొందడం ఎలాగో తెలుసా? చాలా సింపుల్. మీ వాట్సాప్ ద్వారా ఈజీగా ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే PDF ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేయొచ్చు. మీ దగ్గర ప్రస్తుతం ఆధార్ పీడీఎఫ్ ఫైల్ లేకుంటే వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మీ ఆధార్ కార్డు కోసం ఏ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ పీడీఎఫ్ నేరుగా వాట్సాప్‌లో పొందవచ్చు.
ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం ఎలా? :
మీ ఫోన్లో 9013151515 నంబర్‌ను మై గవర్నమెంట్ హెల్ప్‌డెస్క్‌గా సేవ్ చేసుకోండి.
- ఇప్పుడు, ఈ నంబర్‌కు వాట్సాప్ ద్వారా Namaste లేదా Hi పంపండి.
- డిజీ లాకర్ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ డిజీలాకర్ అకౌంట్ ఓపెన్ చేయండి.
- లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి.
- మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీరు అందుకున్న OTPని వాట్సాప్ చాట్‌కు పంపండి.
- OTP వెరిఫై తర్వాత డిజీలాకర్‌లో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల లిస్టును చెక్ చేయండి.
- ఈ లిస్ట్ నుంచి మీ ఆధార్ కార్డును ఎంచుకోండి.
- మీరు వాట్సాప్‌లో ఆధార్ PDF పొందవచ్చు.
డిజిలాకర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? :
- డిజిలాకర్‌లో అకౌంట్ సెటప్ కోసం డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్‌ను విజిట్ చేయండి.
- సైన్-అప్ కోసం మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- మీ ఫోన్‌కు OTP వస్తుంది. అది ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత మీ అకౌంట్ పేరు, పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.
మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీ ఆధార్‌ను డిజిలాకర్‌తో లింక్ చేయండి. వెరిఫికేషన్ కోసం మీ మొబైల్‌కు OTP వస్తుంది ఎంటర్ చేయండి. మీరు ఇప్పుడు మీ డాక్యుమెంట్లను యాక్సెస్ చేయవచ్చు. ఇతర డాక్యుమెంట్లకు కూడా లింక్ చేయవచ్చు.
ఈ-ఆధార్ ఏంటి? :
ఇ-ఆధార్ అనేది మీ ఫిజికల్ ఆధార్ కార్డు డిజిటల్ వెర్షన్. మీరు ఇకపై ఫిజికల్ కార్డును మీతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ వెర్షన్ ఆధార్‌కు లింక్ అయి ఉంటుంది. ఈ-ఆధార్‌లో మీ పేరు, అడ్రస్, ఇతర ముఖ్యమైన వివరాలు, అలాగే QR కోడ్ ఉంటాయి. వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆధార్ డౌన్లోడ్ చేయడం ఎలా? :
- మీరు ఇ-ఆధార్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
- ముందుగా, అధికారిక (UIDAI) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- డౌన్లోడ్ కోసం మీ ఆధార్ నంబర్, ఎన్రోల్మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ (VID)ని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఇన్పుట్ చేయండి.
- Send OTP ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- వెబ్సైట్లో ఈ OTP ఎంటర్ చేయండి.
- మీ ఇ-ఆధార్ అప్పుడు డౌన్లోడ్ అవుతుంది.
- మీరు ఫైల్ ఆప్షన్ ఎంచుకుని మీ మొబైల్ ఫోన్లో యాక్సెస్ చేయవచ్చు.
