Yash : ‘సలాం రాఖీ భాయ్’ అంటూ యశ్ కూతురు హంగామా.. వైరల్ అవుతున్న వీడియో..

ఇప్పటివరకు 'కేజీయఫ్‌ 2'తో బిజీగా ఉన్న యశ్‌ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఖాళి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే టూర్ కి కూడా వెళ్ళొచ్చాడు ఫ్యామిలీతో కలిసి..............

Yash : ‘సలాం రాఖీ భాయ్’ అంటూ యశ్ కూతురు హంగామా.. వైరల్ అవుతున్న వీడియో..

Yash Daughter

 

Yash :  ఇటీవల రిలీజ్ అయిన ‘కేజీయఫ్‌ 2’ ఏ రేంజ్ లో సక్సెస్‌ అయిందో అందరికి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమా యశ్‌ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ‘కేజీయఫ్‌ 1’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్ ఈ సినిమాతో మరింత ఎత్తుకి ఎదిగాడు. మొన్నటి దాకా ఈ సినిమా షూట్, ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు యశ్. ప్రస్తుతం ‘కేజీయఫ్‌ 2’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇప్పటివరకు ‘కేజీయఫ్‌ 2’తో బిజీగా ఉన్న యశ్‌ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఖాళి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే టూర్ కి కూడా వెళ్ళొచ్చాడు ఫ్యామిలీతో కలిసి. యశ్‌ గతంలోనూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక తన ఇద్దరు చిన్న పిల్లల క్యూట్ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన కూతురు ఐరాతో సరదాగా గడుపుతున్న ఓ వీడియోని యశ్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Manchu Lakshmi : మోహన్ బాబు తిరుపతి ఇంటిని చూశారా? మంచు లక్ష్మి హోమ్ టూర్..

‘కేజీయఫ్‌’ సినిమాలోని టైటిల్ సాంగ్ ‘సలాం రాకీ భాయ్‌..’ అంటూ ఐరా క్యూట్‌గా పాడగా దానిని వీడియో తీసి యశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు యశ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక యశ్ తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్ ని 2016లో పెళ్లి చేసుకోగా యశ్ కి కూతురు ఐరాతో పాటు, కొడుకు యథర్వ్ ఉన్నాడు.