Manchu Lakshmi : మోహన్ బాబు తిరుపతి ఇంటిని చూశారా? మంచు లక్ష్మి హోమ్ టూర్..

గతంలో మంచు లక్ష్మి హైదరాబాద్ లో ఉన్న మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసింది. తాజాగా తిరపతిలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేసి ఆ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో.........

Manchu Lakshmi : మోహన్ బాబు తిరుపతి ఇంటిని చూశారా? మంచు లక్ష్మి హోమ్ టూర్..

Manchu Lakshmi

Manchu Lakshmi :  ఇటివల సెలబ్రిటీలంతా తమ ఇళ్ళని చూపిస్తూ హోమ్ టూర్ పేరుతో వీడియోల్ని చేస్తున్నారు. ఆ వీడియోల్ని తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టి అభిమానులకి, ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నారు. మోహన్ బాబు కుమార్తెగా పరిచమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన వర్క్స్, ఫోటోషూట్స్, ఎక్సర్‌‍సైజ్‌లు, తన పాపతో ఆడుకున్న వీడియోలు, ఇంట్లో చేసుకునే పండగలు ఇలా అన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో పెడుతూ ఉంటుంది మంచు లక్ష్మి.

Niharika Konidela: ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇన్‌స్టాలోకి మెగా డాటర్ రీ ఎంట్రీ!

తన యూట్యూబ్ ఛానల్ లోను, సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మికి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. గతంలో మంచు లక్ష్మి హైదరాబాద్ లో ఉన్న మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసింది. తాజాగా తిరపతిలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేసి ఆ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ హోమ్ టూర్ లో మొదట బయట గ్రీనరీ ప్లేస్, పెద్ద హాల్, హాల్ లో పెదరాయుడు సినిమాలో వాడిన ఉయ్యాల, పెద్ద ఫ్యామిలీ ఫోటో చూపించింది. ఆ తర్వాత లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, లోపలే ఉన్న గ్లాస్ లిఫ్ట్, టీవీ రూమ్, కిచెన్, మంచు లక్ష్మి బెడ్ రూమ్, మరో బెడ్ రూమ్స్, పూజ గది, పక్కనే ఉన్న గెస్ట్ హౌస్.. ఇలా అన్నిటిని చూపించింది. ఈ ఇంట్లో ప్రతిదీ కూడా రోజ్ వుడ్‌తో, గ్లాస్‌తో స్పెషల్‌గా మోహన్ బాబు చేయించారని తెలిపింది.