Yash : రాకింగ్ స్టార్ యశ్‌కి ఆ హీరోయిన్‌తో కలిసి నటించాలని ఉందట..

రాకింగ్ స్టార్ యశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి తెలిపాడు. కేజీఎఫ్‌-2 సక్సెస్‌ మూడ్ లో ఉన్న యశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..............

Yash : రాకింగ్ స్టార్ యశ్‌కి ఆ హీరోయిన్‌తో కలిసి నటించాలని ఉందట..

Deepika

 

Deepika Padukone :  యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్‌’ రెండు పార్టులు కూడా భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ 2’ సినిమా భారీ విజయం సాధించి ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాతో యశ్ మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోలలో యశ్ కూడా ఒకరు. బాలీవుడ్ లో కూడా యశ్ కి అభిమానులు ఏర్పడ్డారు. బాలీవుడ్ వర్గాలు కూడా యశ్ తో సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నాయి.

Rajasekhar : జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు.. మోసం చేశారంటూ నిర్మాత వ్యాఖ్యలు..

తాజాగా ఈ రాకింగ్ స్టార్ యశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి తెలిపాడు. కేజీఎఫ్‌-2 సక్సెస్‌ మూడ్ లో ఉన్న యశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫేవరెట్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె అని, తనతో కలిసి నటించాలని ఉందని, దీపిక నటన ఎంతో బాగుంటుందని, ఆమె సినిమాలను రెగ్యులర్ గా చూస్తూ ఉంటానని యశ్‌ తెలిపాడు. మరి కేజీఎఫ్‌ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్ పక్కన దీపికా నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.