Yashoda: యశోదతో పాటు వస్తున్న మరో మూడు సినిమాలు

స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

Yashoda: యశోదతో పాటు వస్తున్న మరో మూడు సినిమాలు

Yashoda Movie Along With Other Three Movies To Stream In Digital Platforms On Same Day

Yashoda: స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

Yashoda : సమంత ‘యశోద’ వివాదానికి ముగింపు పలికిన నిర్మాతలు..

యశోద సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, ఈ సినిమాను డిసెంబర్ 9న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే యశోద సినిమాతో పాటు అదే రోజున మరో మూడు సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’, అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’, సంతోష్ శోభన్ నటించిన ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమాలు కూడా అదే రోజున స్ట్రీమింగ్ కానున్నాయి.

Yashoda: ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న యశోద.. వచ్చేది అప్పుడేనా?

దీంతో డిసెంబర్ 9న ప్రేక్షకులకు ఒకేసారి నాలుగు సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి. మరి ఓటీటీలో ఈ నాలుగు సినిమాల్లో ప్రేక్షకులు దేనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. నాలుగు సినిమాలు కూడా వైవిధ్యమైన నేపథ్యంతో వచ్చిన సినిమాలు కావడం విశేషం. మరి డిసెంబర్ 9న ఓటీటీలో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.