Yashoda : సమంత ‘యశోద’ వివాదానికి ముగింపు పలికిన నిర్మాతలు..

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'యశోద'. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. యశోద మూవీలో 'ఈవా' అనే పేరుతో ఉన్న హాస్పిటల్ లో దారుణాలు జరుగుతున్నట్లు చూపించారు. కాగా...

Yashoda : సమంత ‘యశోద’ వివాదానికి ముగింపు పలికిన నిర్మాతలు..

Producers of Samantha Yashoda put an end to the controversy

Yashoda : సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టీజర్ అండ్ ట్రైలర్ ఆకట్టుకోవడం, అనారోగ్య ప్రస్థితిలో కూడా సమంత ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేయడంతో.. థియేటర్ వద్ద ఓపెనింగ్స్ బాగానే రాబటింది. ఈ మూవీలోని సామ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉండడంతో, సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.

Samantha : “నేను పోరాడ గలిగితే, నువ్వు పోరాడ గలవు”.. సమంత నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. విక్రమ్ భట్!

అయితే ఈ సినిమా ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. యశోద మూవీలో ‘ఈవా’ అనే పేరుతో ఉన్న హాస్పిటల్ లో దారుణాలు జరుగుతున్నట్లు చూపించారు. కాగా ఆ పేరు మీద నిజంగా బయట ఒక హాస్పిటల్ ఉండడంతో, వారు సినిమాపై కేసు వేశారు. తాజాగా ఈ వివాదానికి ముగింపు పలికారు నిర్మాతలు.

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. “మా సినిమాలో ఈవా అనే పేరుని కాన్సెప్ట్ ప్రకారం పెట్టబడింది. వేరొకరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు. ఈవా హాస్పిటల్ యాజమాన్యాన్ని నేను కలిసి జరిగినది చెప్పాను. ఇక ఫ్యూచర్ లో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదు. మా నిర్ణయాన్ని ఇవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్యకు ఇంతటితో ముంగింపు పడింది” అంటూ వెల్లడించారు.

ఈవా హాస్పిటల్ ఎండి మోహన్ రావు మాట్లాడుతూ.. “డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్ ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాగూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం. దాని వలనే యశోదలో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము హర్ట్ ఆయ్యాము. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.