Samantha : “నేను పోరాడ గలిగితే, నువ్వు పోరాడ గలవు”.. సమంత నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. విక్రమ్ భట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. 'మయోసైటిస్' అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఆరోగ్యంపై బాలీవుడ్ డైరెక్టర్ 'విక్రమ్ భట్' నేషనల్ మీడియాలో ప్రస్తావించాడు. సమంతలా..

Samantha : “నేను పోరాడ గలిగితే, నువ్వు పోరాడ గలవు”.. సమంత నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. విక్రమ్ భట్!

Bollywood Director Vikram Bhatt Comments on Samantha rare disease

Updated On : November 28, 2022 / 4:33 PM IST

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ‘మయోసైటిస్’ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ ఇమ్యూనిటీ డిజార్డర్, కండరాల బలహీనత మరియు తీవ్ర నొప్పికి దారితీస్తుంది. కొన్నిసారులు ప్రాణాంతనికి కూడా దారితీస్తుంది. ఇలాంటి ప్రస్థితిలో సమంతని చూసిన అభిమానులు, ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Samantha : కేరళలో సమంత.. మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం..?

ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఆమెకు ధైర్యం చెబుతూ ట్వీట్ లు వేస్తున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యంపై బాలీవుడ్ డైరెక్టర్ ‘విక్రమ్ భట్’ నేషనల్ మీడియాలో ప్రస్తావించాడు. సమంతలా తాను కూడా కండరాలకి సంబందించిన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దాదాపు 18 ఏళ్లగా ఈ వ్యాధితో బాధపడుతున్నా, సిగ్గుతో ఎవరికి చెప్పుకోలేకపోయినట్లు తెలియజేశాడు.

“తన డిజార్డర్ గురించి అందరి ముందుకు వచ్చి చెప్పిన సమంత ధైర్యం.. నాలో భయాన్ని పోగొట్టింది. ఇప్పటితో నా మౌనాన్ని వీడాలని నిర్ణయించుకున్నాను. ఇటువంటి అరుదైన వ్యాధితో బాధపడేవారికి ధైర్యం చెప్పి, బలాన్ని ఇవ్వాలని అనుకుంటున్నా. కుదిరితే సమంతని కూడా కలిసి.. నేను పోరాడ గలిగితే, నువ్వు పోరాడ గలవు అని చెప్పాలని ఉంది” అంటూ వ్యాఖ్యానించాడు.