Samantha : కేరళలో సమంత.. మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం..?

ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుందని ఇటీవల కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా సమంత మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లిందని సమాచారం. సమంతకి మాయోసైటిస్ వచ్చాక..............

Samantha : కేరళలో సమంత.. మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం..?

Samantha went to kerala for ayurvedam to recover from mayosaitis

Updated On : November 27, 2022 / 9:21 AM IST

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంత, ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో తనకి మాయోసైటిస్ వ్యాధి సోకిందని, చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. దీంతో సమంత అభిమానులతో పాటు, ప్రేక్షకులు కంగారుపడ్డారు. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుందని ఇటీవల కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా సమంత మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లిందని సమాచారం. సమంతకి మాయోసైటిస్ వచ్చాక అమెరికాలో ఒకసారి చికిత్స తీసుకుంది. అదే చికిత్సని ఇండియాలో కూడా కంటిన్యూ చేస్తుంది. అయితే కేరళలో ఆయుర్వేద వైద్యంతో తగ్గుతుందని తెలిసి సమంత కేరళ వెళ్లినట్టు తెలుస్తుంది.

Pawan Kalyan : హరిహర వీరమల్లు కోసం పవన్ మళ్ళీ కరాటే నేర్చుకుంటున్నాడా?? వైరల్ అవుతున్న పవన్ ఫోటోలు..

సమంత ఆల్రెడీ కేరళ వెళ్లి ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుంటున్నట్టు, త్వరలోనే కోలుకుంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. సమంత ఏ వైద్యం చేసుకున్నా త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.