Pawan Kalyan : హరిహర వీరమల్లు కోసం పవన్ మళ్ళీ కరాటే నేర్చుకుంటున్నాడా?? వైరల్ అవుతున్న పవన్ ఫోటోలు..

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడికల్ మూవీ కావడం, ఇందులో పవన్............

Pawan Kalyan : హరిహర వీరమల్లు కోసం పవన్ మళ్ళీ కరాటే నేర్చుకుంటున్నాడా?? వైరల్ అవుతున్న పవన్ ఫోటోలు..

Pawan Kalyan in karate dress looks goes viral

Updated On : November 27, 2022 / 9:06 AM IST

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలకి టైం అడ్జస్ట్ చేస్తూ ఉండటంతో సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో ఉన్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.

ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇకపై ఆగదని, ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ లో హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేస్తామని షూటింగ్ శరవేగంగా కొనసాగిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడికల్ మూవీ కావడం, ఇందులో పవన్ బందిపోటుగా నటిస్తుండటం, ఫైట్స్ ఎక్కువగా ఉండటంతో పవన్ ఆ పాత్రకోసం రకరకాల శిక్షణలు తీసుకుంటున్నాడు.

Janhvi Kapoor : నేను సౌత్ అమ్మాయినే.. మరోసారి సౌత్ సినిమాలపై జాన్వీ వ్యాఖ్యలు..

కొన్ని రోజుల క్రితం పవన్ శిక్షణ తీసుకుంటున్న కొన్ని ఫోటోలు బయటకి రాగా తాజాగా పవన కరాటే నేర్చుకుంటున్న ఫోటోలు బయటకి వచ్చాయి. పవన్ గతంలో కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు. కొన్ని సినిమాల్లో తన కరాటే విద్యాలని కూడా ప్రదర్శించాడు. తాజాగా హరిహర వీరమల్లు షూట్ సెట్ లో పవన్ కరాటే డ్రెస్ లో కనిపించాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం పవన్ మరోసారి కరాటే నేర్చుకుంటున్నాడా అని అనుకుంటున్నారు. ఏదైతేనేం సినిమా కోసం పవన్ మాత్రం చాలా కష్టపడుతున్నాడు. సినిమా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.