RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా అని ఆర్ఆర్ఆర్ ను ఎందుకు అంటున్నారో ఒక్క పాటతో చెప్పేశారు ఆర్ఆర్ఆర్ టీమ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు అల్లూరి..

RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!

RRR

RRR: ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా అని ఆర్ఆర్ఆర్ ను ఎందుకు అంటున్నారో ఒక్క పాటతో చెప్పేశారు ఆర్ఆర్ఆర్ టీమ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం ఇండియన్ సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!

తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన నాటు నాటు లిరికల్ వీడియో సాంగ్ యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఒక్క యూట్యూబ్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే. ఒక్క యూట్యూబ్ లోనే ఇప్పటి వరకూ ఈ సాంగ్ 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించి ఇప్పుడు యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ పాట విపరీతం గా వైరల్ అవుతూ ఆర్ఆర్ఆర్ అభిమానులు పండగ చేస్తున్నారు.

Chiranjeevi: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ దూకుడు!

ఇండియన్ సినిమాలో బెస్ట్ డాన్సర్లలో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్థానం గురించి తెలిసిందే. కాగా.. ఈ పాటకి ఇప్పుడు ఇద్దరూ తొలిసారిగా కలిసి స్టెప్పులు వేయడంతో పాటకి క్రేజ్ మరింతగా పెరిగింది. ఇద్దరూ కలిసి చేసిన మాస్ డాన్స్ బీట్లు అయితే మైండ్ బ్లోయింగ్. యూట్యూబ్ లో ఈ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన యూట్యూబ్ వారే స్వయంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

Janhvi Kapoor : జాన్వీ కపూర్ బికినీ షో… దుబాయ్ టూర్‌లో ధడక్ స్టార్ దూకుడు.. Photos

‘హానెస్ట్ గా చెప్పాలి అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ 0.5 స్లో మోషన్ లో పెట్టినా కూడా మేము ఫాస్ట్ గానే ఫీల్ అవుతున్నాం’ అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కామెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యూట్యూబ్ కూడా అందని మన హీరోల నాటు డాన్స్ ఇదే అంటూ మెగా-నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.