Pawan Kalyan : ఒక్కరోజులోనే 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. అమెరికాలో భీమ్లా నాయక్ కాసుల వర్షం..

తాజాగా 'భీమ్లా నాయక్' సినిమా కూడా అమెరికాలో భారీ రేంజ్ లో రిలీజ్ అయింది. అక్కడ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించడం అంటే మాములు విషయం కాదు. మన స్టార్ హీరోలకి ఏదో ఒక సినిమాతో.......

Pawan Kalyan :  ఒక్కరోజులోనే 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. అమెరికాలో భీమ్లా నాయక్ కాసుల వర్షం..

Bheemla

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా కంటే ముందే పాటలు, ట్రైలర్స్ తో సినిమా మీద హైప్ పెరిగింది. భారీ అంచనాల మధ్య విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న పవన్ అభిమానులు హంగామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్నంతా పవన్ నామ స్మరణే జరిగింది. అన్ని థియేటర్లలోనూ భీమ్లా నాయక్ సినిమానే నడిచింది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయని సమాచారం.

అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పవర్ స్టార్ సినిమా పవర్ చూపించింది. భారతదేశ సినిమాకి ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్ కలిగింది అమెరికాలోనే. అమెరికాలో తెలుగు వాళ్ళు, భారతీయులు ఎక్కువగా ఉండటంతో మన సినిమాలకి అక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో మన తెలుగు సినిమాలన్నీ అక్కడ రిలీజ్ అవుతాయి. అమెరికాలో కూడా తెలుగు సినిమాలకి రచ్చ రచ్చ చేస్తారు అక్కడి అభిమానులు. ఇక స్టార్ హీరోల సినిమాలకి చెప్పాల్సిన పనే లేదు.

Bheemla Nayak : తమన్.. లాలా భీమ్లా.. స్టెప్పులు అదిరేలా..

తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా అమెరికాలో భారీ రేంజ్ లో రిలీజ్ అయింది. అక్కడ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించడం అంటే మాములు విషయం కాదు. మన స్టార్ హీరోలకి ఏదో ఒక సినిమాతో అక్కడ 1 మిలియన్ డాలర్ల రికార్డ్ ఉన్నాయి. అయితే వారంతా సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు రోజులకి ఆ రికార్డు సాధించారు. గతంలో పవన్ కి కూడా 1 మిలియన్ డాలర్ల రికార్డు ఉంది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో అమెరికాలో ఒక్కరోజులోనే 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టారు. దీంతో భీమ్లా నాయక్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. మరో రెండు రోజులు వీకెండ్ ఉంది కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.