Bheemla Nayak : తమన్.. లాలా భీమ్లా.. స్టెప్పులు అదిరేలా..

తమన్ మరోసారి స్టెప్పులతో అదరగొట్టాడు. 'భీమ్లా నాయక్' సినిమాలో 'లాలా.. భీమ్లా..' అంటూ సాగిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అందర్నీ ఒక ఊపు ఊపేసింది. అభిమానులు అయితే ఈ పాటకి పూనకం.........

Bheemla Nayak :  తమన్.. లాలా భీమ్లా.. స్టెప్పులు అదిరేలా..

Taman

Updated On : February 26, 2022 / 9:55 AM IST

Thaman :  మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తను మ్యూజిక్ ఇచ్చిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతుంది. తను BGM ఇచ్చిన ప్రతి సినిమా భారీ విజయం సాధిస్తుంది. ఇటీవల తమన్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అన్ని ముందే మంచి హిట్ కొట్టాయి.

 

ఇటీవల తమన్ తను కంపోజ్​ చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి’ సాంగ్ కు మహేష్ వేసిన స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మహేష్ అభిమానులని ఆనందపరిచాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్​ మాస్టర్​తో కలిసి మహేష్ చేసిన స్టెప్పులని దించేసాడు. ఇన్నాళ్లు సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కనపడిన తమన్ ఇలా స్టెప్పులు వేసేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ అభినందించారు. తమన్ వేసిన ఆ స్టెప్పులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Atharva : రజినీకాంత్ చేతుల మీదుగా ధోని ‘అధర్వ’ రిలీజ్

తాజాగా తమన్ మరోసారి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘లాలా.. భీమ్లా..’ అంటూ సాగిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అందర్నీ ఒక ఊపు ఊపేసింది. అభిమానులు అయితే ఈ పాటకి పూనకం వచ్చేలా ఊగిపోయారు. తమన్ ఆ రేంజ్ లో దీనికి మ్యూజిక్ ఇచ్చారు. తాజాగా తమన్ ఈ సాంగ్ కి కూడా స్టెప్పులేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను కంపోజ్ చేసిన ఈ ఫుల్‌బీట్ సాంగ్‌కి ఓ రేంజ్‌లో డ్రమ్స్ శివమణితో పాటు మరికొంతమందితో కలిసి పూనకంతో స్టెప్పులేసి మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు తమన్. పవన్ ఫ్యాన్స్ తమన్ స్టెప్పులు చూసి ఆనందించి ఈ వీడియోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.