Ram Charan : మరో డైరెక్టర్ ఇచ్చిన కథతో శంకర్ RC 15..

ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. RC 15 సినిమా కథ శంకర్ ది కాదంట. కోలీవుడ్ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో RC 15 సినిమా గురించి......

Ram Charan : మరో డైరెక్టర్ ఇచ్చిన కథతో శంకర్ RC 15..

Rc 15

RC 15 :  భారీ బడ్జెట్స్ తో సినిమాలని తెరకెక్కించే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్నారు. RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణెలలో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. త్వరలో ఫిబ్రవరిలోనే ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవనుంది.

అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. RC 15 సినిమా కథ శంకర్ ది కాదంట. కోలీవుడ్ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో RC 15 సినిమా గురించి మాట్లాడాడు. తమిళ్ లో పిజ్జా, జిగర్తాండ, పేట, జగమే తాండ్రం.. లాంటి హిట్ సినిమాలు తీసిన కార్తీక సుబ్బరాజు ఈ సినిమాకి కథ అందించినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Nelson Dilip Kumar : రజినీకాంత్ నెక్స్ట్ సినిమా.. ఫామ్‌లో ఉన్న దర్శకుడితో..

కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ”డైరెక్టర్ శంకర్ కి నా దగ్గర ఉన్న ఓ పొలిటికల్ కథని చెప్పాను. ఆయన దానిని తీసుకుంటా అన్నారు. ఓకే చెప్పాను. కథ మాత్రమే నాది దానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని ఆయనే రాసుకున్నారు. ఆ సినిమానే రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్నారు” అని తెలిపాడు. దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.