Nelson Dilip Kumar : రజినీకాంత్ నెక్స్ట్ సినిమా.. ఫామ్‌లో ఉన్న దర్శకుడితో..

 ఇటీవల రజినీకాంత్ కి వరుస సమస్యలు, బాధలు ఎదురవురుతున్నాయి. మొన్నటిదాకా కొంత కాలం అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా అప్పటికి ఉన్న 'పెద్దన్న' సినిమాని........

Nelson Dilip Kumar :  రజినీకాంత్ నెక్స్ట్ సినిమా.. ఫామ్‌లో ఉన్న దర్శకుడితో..

Rajinikanth (1)

Rajinikanth :  ఇటీవల రజినీకాంత్ కి వరుస సమస్యలు, బాధలు ఎదురవురుతున్నాయి. మొన్నటిదాకా కొంత కాలం అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా అప్పటికి ఉన్న ‘పెద్దన్న’ సినిమాని పూర్తి చేశారు. ఇటీవల తన పెద్ద కూతురు ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్ తో విడిపోయింది. ఈ విషయంలో రజినీకాంత్ వీరిద్దర్నీ కలపడానికి ఎంతో ప్రయత్నించినా కానీ ఉపయోగం లేదు. వీరి విడాకుల విషయంలో రజినీకాంత్ చాలా బాధపడ్డారని తెలిసింది.

ఇలా ఇన్ని సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటకి వచ్చి మళ్ళీ అభిమానుల కోసం సినిమా చేయడానికి తలైవా రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి రజినీకాంత్ చేతిలో ఏ సినిమాలు లేవు. తాజాగా రజినీకాంత్ ఓ సినిమా ఓకే చేశారని సమాచారం. కోలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. నెల్సన్ ఇప్పటికి కొలమావు కోకిల, డాక్టర్ సినిమాలు తీశారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ తో ‘బీస్ట్’ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

Sehari : బాలకృష్ణ వల్లే ఈ సినిమాకి హైప్ వచ్చింది..

ఇటీవలే నెల్సన్ రజినీకాంత్ ని కలిసి ఓ కథ చెప్పగా రజిని ఓకే చెప్పినట్టు సమాచారం. రజిని ఇటీవల యువ దర్శకులని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే నెల్సన్ కి కూడా డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే ‘బీస్ట్’ సినిమా రిలీజ్ అయ్యాక రజినీకాంత్ సినిమా మొదలవ్వనుంది. బీస్ట్ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధించి నెల్సన్ హ్యాట్రి హిట్ కొడతాడని అంటున్నారు. ‘బీస్ట్’ సినిమా సమ్మర్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

MTV Roadies : యాంకర్‌గా మారనున్న సోనూసూద్

మొత్తానికి రజినీకాంత్ 169వ సినిమా ఇలా ఫామ్ లో ఉన్న దర్శకుడు నెల్సన్ తో ఫిక్స్ అయింది. ఈ సినిమా సమ్మర్ లో షూటింగ్ కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటికి రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలని అనుకుంటున్నారట.