Date Fruits With Honey : తేనెతో కలిపి ఖర్జూర పండ్లు ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు!

తేనె, ఖ‌ర్జూరాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నివారించ‌బ‌డుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను, తేనెతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.

Date Fruits With Honey : తేనెతో కలిపి ఖర్జూర పండ్లు ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు!

Date fruits mixed with honey

Date Fruits With Honey : ఖర్జూర పండులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. అలాగే ప్రకృతి ప్రసాదించిన తేనెలో సైతం ఔషదగుణాలు ఉన్నాయి. ఇవి రెండు శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తాయి.  అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఖ‌ర్జూర పండ్ల‌ను తేనెతో క‌లిపి తీసుకుంటే మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు మంచి పౌష్టికాహారంలా ప‌ని చేస్తుంది.

తేనెలో నాన‌బెట్టిన ఖ‌ర్జూరాల‌ను ప‌డుకునే ముందు తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. శ‌రీరంలో హార్మోన్ల‌ను స‌మ‌తుల్యం చేస్తుంది. జీవ‌క్రియ‌ల రేటును పెంచుతుంది. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు త‌గ్గుతుంది. గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. గొంతు నొప్పి, మంట‌, జ‌లుబు, శ్లేష్మం వంటి వాటికి బాగా ఉపకరిస్తుంది. ఎముక‌లు ధృడంగా మార‌తాయి. ఉద‌ర క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ర‌క్త‌హీన‌త‌ను తగ్గించ‌డంలో కూడా ఖ‌ర్జూర పండ్లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి.

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గుతుంది. తద్వారా మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటాం. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా ఈ మిశ్ర‌మం మేలు చేస్తుంది. తేనె, ఖ‌ర్జూరాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నివారించ‌బ‌డుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను, తేనెతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి.

ఖర్జూరాల్లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్ చేస్తాయి.

తేనె, ఖ‌ర్జూర పండ్ల మిశ్రమం తయారీ ;

దీని కోసం ముందుగా ఒక బాటిల్ తీసుకుని అందులో స‌గానికి తేనెను పోయాలి. ఇప్పుడు గింజ‌లు తీసేసిన ఎండు ఖ‌ర్జూరాల‌ను అందులో వేసి మునిగేంత వ‌ర‌కు తేనె పోయాలి. వీటిని క‌దిలించ‌కుండా వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. వారం త‌రువాత ఒక స్పూన్ స‌హాయంతో రోజుకు ఒక‌టి తీసుకుని తినాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది.