Samsung Galaxy S25 Plus : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఏకంగా ఎంతంటే?
Flipkart Valentine’s Day Sale 2026 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ 25 శాతం డిస్కౌంటుతో లభిస్తోంది.
Samsung Galaxy S25 Plus
- ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ 2026 ఆఫర్లు
- శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ పై 25 శాతం డిస్కౌంట్
- 12GB ర్యామ్ వేరియంట్ రూ. 74,999 ధరకే
Flipkart Valentine’s Day Sale 2026 : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం వాలెంటైన్స్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ సమయంలో అనేక ప్రీమియం శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
మీరు శాంసంగ్ అనేక లేటెస్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లతో పాటు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, వేరబుల్ గాడ్జెట్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ :
ఈ సేల్‌లో గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా, 12GB ర్యామ్ వేరియంట్ రూ. 74,999 ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మీ పాత స్మార్ట్‌ఫోన్ మార్చుకుంటే ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 59,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అయితే, ఈ మొత్తం మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై మరిన్ని డిస్కౌంట్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లు రూ. 8,999 నుంచి ప్రారంభమవుతాయి. గెలాక్సీ ‘ఎ’ సిరీస్ ఫోన్లపై రూ. 19,999 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ ప్రీమియం గెలాక్సీ ఎస్ సిరీస్‌లోని ఇతర ఫ్లాగ్షిప్ ఫోన్లు రూ. 42,999కు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కూడా రూ. 99,999కు ధరకు లభిస్తుంది.
ఈ సేల్ సమయంలో ఇతర శాంసంగ్ మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లపై అదనపు క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. మీరు శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈతో సహా కొన్ని కలర్‌ఫుల్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లు కూడా కొనుగోలు చేయవచ్చు.
మీరు లాంచ్ ధర కన్నా తక్కువ ధరకే అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఎన్నిరోజులు ఉంటుందో క్లారిటీ లేదు. ఈ వాలెంటైన్స్ డే డీల్స్ సందర్భంగా ఫ్యాషన్ వస్తువులు, హోం అప్లియన్సెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు.
