Oppo Find X8 Pro : వావ్.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై దిమ్మతిరిగే ఆఫర్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!
Oppo Find X8 Pro : కొత్త ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ప్లాట్ ఫారంలో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Oppo Find X8 Pro
- ఒప్పో ఫైండ్ X8 ప్రో అసలు ధర రూ. 99,999
- రూ. 15వేలు నేరుగా డిస్కౌంట్, తగ్గింపుతో రూ. 84,999
- క్రెడిట్ కార్డులపై రూ. 4వేలు అదనపు డిస్కౌంట్
Oppo Find X8 Pro : ఒప్పో ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. ఇటీవలే భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో ఉన్నాయి. గత జనరేషన్ ఫ్లాగ్షిప్ ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్ కూడా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 19వేల భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది.
పాత మోడల్ అయినప్పటికీ, ఒప్పో ఫైండ్ X8 ప్రో కూడా పవర్ఫుల్ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఫుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర రూ.99,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.84,999కు లిస్ట్ అయింది. రూ.15,000 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేయవచ్చు.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ అందిస్తుంది. ఇంకా, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,910mAh బ్యాటరీని అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్వైటీ808 మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ ఎల్వైటీ600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 సెన్సార్, 120x డిజిటల్ జూమ్‌తో 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 32MP కెమెరాతో వస్తుంది.
