Parvati Nair : లైంగిక వేధింపుల కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది.. మలయాళ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు..

పలు తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పార్వతి నాయర్ ఇటీవల తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది. అక్టోబర్‌లో చెన్నైలోని...........

Parvati Nair :  లైంగిక వేధింపుల కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది.. మలయాళ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు..

a worker in Parvati Nair house sensational comments on her

Updated On : November 12, 2022 / 6:45 AM IST

Parvati Nair :  పలు తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పార్వతి నాయర్ ఇటీవల తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది. అక్టోబర్‌లో చెన్నైలోని నుంగంబాక్కంలోని తన ఇంట్లో దాదాపు రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీకి గురైందని, తన ఇంట్లో పనిచేసే సుభాష్ పై అనుమానముందని పార్వతి పోలీసులకి ఫిర్యాదు చేసింది.

ఈమె ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా పార్వతి నాయర్ ఇంట్లో పనిచేసే సుభాష్ ని అదుపులోకి తీసుకున్నారు. సుభాష్ ఇంటికి కూడా వెళ్లి చెక్ చేశారు. అయితే ఈ దర్యాప్తులో సుభాష్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. సుభాష్ ని పోలీసులు విచారించగా.. ”పార్వతి నాయర్ నాపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. తన ఇంట్లోకి రాత్రి పూట ఎవరెవరో వచ్చేవాళ్ళు. అది నేను చూశానని, నన్ను టార్చర్ పెట్టింది. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో అది నా మీదకి తోసేసి నన్ను మానసికంగా వేధిస్తుంది. గతంలో నన్ను కొట్టింది, నా ముఖం పై ఉమ్మి వేసింది. నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించింది” అని తెలిపాడు.

BiggBoss 6 Day 68 : కొత్త కెప్టెన్ ఫైమా.. జైల్లోకి ఇనయా..

దీంతో సుభాష్ చెప్పిన ఈ విషయాలు సంచలనంగా మారాయి. పోలీసులు దార్యప్తుని కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో పార్వతి నాయర్ ని కూడా విచారించే అవకాశం ఉంది. అయితే సుభాష్ చేసిన వ్యాఖ్యలపై పార్వతి నాయర్ స్పందించలేదు.