BiggBoss 6 Day 68 : కొత్త కెప్టెన్ ఫైమా.. జైల్లోకి ఇనయా..

బిగ్‌బాస్‌ లో రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఒకరికొకరు కొట్టుకొని, తోసుకొని, తిట్టుకొని, పోటీపడీ మరీ ఆడారు. చివరికి పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో చివరికి..........

BiggBoss 6 Day 68 : కొత్త కెప్టెన్ ఫైమా.. జైల్లోకి ఇనయా..

BiggBoss 6 Day 68 faimaa is new captain for BiggBoss House

BiggBoss 6 Day 68 :  బిగ్‌బాస్‌ లో రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఒకరికొకరు కొట్టుకొని, తోసుకొని, తిట్టుకొని, పోటీపడీ మరీ ఆడారు. చివరికి పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో చివరికి ఫైమా గెలిచి ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైంది.

ఈ టాస్క్ లో ఫైమా, ఆదిరెడ్డి కలిసి ఆడారని ఇనయా ఫైర్ అవ్వగా ఇనయా, ఆదిరెడ్డి మేధ్య గొడవ జరిగింది. ఆదిరెడ్డి ఏం చేస్కుంటావో చేసుకో, నువ్ అన్నదే నిజం అయితే బిగ్‌బాస్‌ వదిలి వెళ్ళిపోతాను అంటూ అరిచాడు. రేవంత్‌, రాజ్‌ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శ్రీహాన్, శ్రీసత్య గురించి తప్పుగా మాట్లాడటంతో శ్రీహాన్ రెచ్చిపోయి రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు.

BiggBoss 6 Day 67 : చెత్త సంచాలక్ రేవంత్.. రోహిత్ వర్సెస్ రేవంత్..

ఆ తర్వాత కంటెస్టెంట్స్ వరస్ట్ పర్ఫార్మర్స్ కి రెడ్ స్టాంప్స్ వేశారు. ఈ వరస్ట్ పర్ఫార్మర్ ఎంపికలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యాయి. ఎక్కువమంది ఇనయాకి రెడ్ స్టాంప్ ఇవ్వగా ఇనయా అందరితో గొడవ పెట్టుకుంది. ఇక శ్రీసత్య, రేవంత్ మధ్య కూడా గొడవ అయింది. సంచాలక్‌గా వరస్ట్ గా చేసావు అని కొంతమంది రేవంత్ కి వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు. ఎక్కువమంది ఇనయాకి ఇవ్వడంతో ఇనయా జైలుకి వెళ్ళింది. నేడు వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతాడో చూడాలి.