BiggBoss 6 Day 67 : చెత్త సంచాలక్ రేవంత్.. రోహిత్ వర్సెస్ రేవంత్..

 బిగ్‌బాస్ లో కెప్టెన్సీ టాస్క్ పోటీ రసవత్తరంగా సాగుతుంది. గత ఎపిసోడ్ లో రేవంత్ కోపంతో గేమ్ వదిలేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఒక్కడే కూర్చొని బాధపడటం మొదలుపెట్టాడు. తన దగ్గరకు ఎవరు వచ్చినా ఏడుస్తూ, ఎమోషనల్ అవుతూ......................

BiggBoss 6 Day 67 : చెత్త సంచాలక్ రేవంత్.. రోహిత్ వర్సెస్ రేవంత్..

BiggBoss 6 Day 67 rohith vs revanth fight

BiggBoss 6 Day 67 :  బిగ్‌బాస్ లో కెప్టెన్సీ టాస్క్ పోటీ రసవత్తరంగా సాగుతుంది. గత ఎపిసోడ్ లో రేవంత్ కోపంతో గేమ్ వదిలేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఒక్కడే కూర్చొని బాధపడటం మొదలుపెట్టాడు. తన దగ్గరకు ఎవరు వచ్చినా ఏడుస్తూ, ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు. బాగా సింపతీ కోసం ట్రై చేశాడు రేవంత్. శ్రీసత్యతో మాట్లాడటం మానేశాడు. అయితే బిగ్‌బాస్ రేవంత్ ని సీక్రెట్ రూమ్ లోకి పిలిచి నెక్స్ట్ టాస్క్ లో సంచాలక్ గా వ్యవహరించామన్నారు.

ఇక ఈ టాస్క్ లో శ్రీసత్య, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్‌ లు పోటీపడ్డారు. ఈ టాస్క్ ప్రకారం పోటీ చేసే సభ్యులకు థర్మాకోల్ బాల్స్ నింపిన గోనె సంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వాటిని వీపుకి తగిలించుకొని అవతలి వాళ్ళ బాల్స్ పడేలా చేయాలి. ఆ బ్యాగ్ కి ఉండే రంద్రం నుంచి ఆ బాల్స్ పడేలా చేయాలి. గేమ్ అయ్యేవరకు ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. దీంట్లో మొదట్లోనే కీర్తి గేమ్ నుంచి అవుట్ అయిపోయింది. ఆ తర్వాత మెరీనా కూడా బయటకి వచ్చేసింది.

ఆ తర్వాత రోహిత్, ఫైమా, ఆది రెడ్డిలు ఆ బాల్స్ పడేయటానికి కొట్టేసుకున్నారు ఏకంగా. ఇక రేవంత్ మధ్యలో ఇష్టమొచ్చినట్టు రూల్స్ చెప్తుంటే గేమ్ మధ్యలో ఎలా రూల్స్ చెప్తావు అని శ్రీసత్య ఫైర్ అయింది. నా ఇష్టం అంటూ రేవంత్ రెచ్చిపోయాడు. ఆదిరెడ్డి, రోహిత్ ఆ బాల్స్ పడేయటానికి కొట్టుకుంటుంటే ఆదిరెడ్డి బ్యాగ్ పట్టుకుంటాడు. రూల్స్ ప్రకారం బ్యాగ్ పెట్టుకోకూడదు అయినా రేవంత్ పట్టించుకోకపోవడంతో రోహిత్ ఫైర్ అయ్యి రేవంత్ తో గొడవపడ్డాడు.

BiggBoss 6 Day 66 : అందరూ రేవంత్‌ని టార్గెట్ చేశారుగా.. బిగ్‌బాస్ కి అనవసరంగా వచ్చాను.. ఏడ్చేసిన రేవంత్..

ఈ విషయంలో రేవంత్, రోహిత్ కి మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరికి రోహిత్ కి చిరాకొచ్చి తానే ఆ బాల్స్ సంచిని పడేసి కాలితో తన్ని గేమ్ నుంచి వచ్చేశాడు. రేవంత్ చెత్త సంచలక్ అంటూ, కొంతమందికి ఫేవర్ గా ఉన్నాడంటూ చాలా సీరియస్ అయ్యాడు రోహిత్. ఇక్కడ రేవంత్ తప్పు చేశాడని చూసే ప్రేక్షకులకి కూడా తెలిసిపోతుంది. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి.