Godfather: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఈ ఇద్దరిపైనే అందరి చూపులు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో, చిరు ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Godfather: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఈ ఇద్దరిపైనే అందరి చూపులు!

All Eyes On These Two People In Godfather Pre-Release Event

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో, చిరు ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Godfather: గాడ్‌ఫాదర్ నుండి మరో అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ‘నజభజ’ సాంగ్!

ఇక నేడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను అనంతపురంలో భారీగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు భారీ ఎత్తున అనంతపురం చేరుకుంటున్నారు. కాగా, ఈ ఈవెంట్‌లో ఎవరెవరు మెరుస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉన్నా.. ఇద్దరిపై మాత్రం అందరి చూపులు ఉన్నాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఏం మాట్లాడతాడా అని అభిమానులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆయనతో పాటు ఈ చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ కూడా ఏం చెప్పబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఎన్వీ. ప్రసాద్ ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రోజున గాడ్‌ఫాదర్ సినిమాకు సంబంధించి చాలా విషయాలను మాట్లాడతానని పలుమార్లు చెప్పుకొచ్చారు.

Godfather: అనంతపురం ఆటో కార్మికుల భారీ ర్యాలీ.. గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

దీంతో ఇవాళ సాయంత్రం ఆయన ఏం మాట్లాడతారా అనేది ప్రస్తుతం చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.