Godfather: గాడ్‌ఫాదర్ నుండి మరో అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ‘నజభజ’ సాంగ్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నజభజ అంటూ సాగే ఓ పవర్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Godfather: గాడ్‌ఫాదర్ నుండి మరో అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ‘నజభజ’ సాంగ్!

Najabhaja Song From Godfather Looks Very Powerful

Godfather: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో గాడ్‌ఫాదర్ మూవీగా రీమేక్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Godfather: సల్మాన్ నటించాడంటే, ఆ క్రెడిట్ అతడిదే అంటోన్న గాడ్‌ఫాదర్

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నజభజ అంటూ సాగే ఓ పవర్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాట వింటే, అభిమానులకు గూస్‌బంప్స్ ఖాయం. హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే పాటగా ఇది వచ్చింది. ఇక ఈ పాట ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.

Godfather: గాడ్‌ఫాదర్ క్లైమాక్స్.. టాలీవుడ్, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..!

ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక అందాల భామ నయనతార, విలక్షణ నటుడు సత్యదేవ్, పూరీ జగన్నాధ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.