Godfather: సల్మాన్ నటించాడంటే, ఆ క్రెడిట్ అతడిదే అంటోన్న గాడ్‌ఫాదర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో యాంకర్ శ్రీముఖి చేసిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. సల్మాన్ ఖాన్‌ను ఈ సినిమాలో నటింపజేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చొరవ ఎక్కువగా ఉందని చిరు పేర్కొన్నారు.

Godfather: సల్మాన్ నటించాడంటే, ఆ క్రెడిట్ అతడిదే అంటోన్న గాడ్‌ఫాదర్

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఇంటర్వ్యూలతో కూడా సోషల్ మీడియాలో గాడ్‌ఫాదర్ మేనియాను నింపేస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో యాంకర్ శ్రీముఖి చేసిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

Godfather: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..

గాడ్‌ఫాదర్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ ఇంటర్వ్యూని ఏకంగా ఆకాశంలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఓ ప్రైవేట్ జెట్ విమానంలో సాగిన ఈ ఇంటర్వ్యూలో చిరు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమాలో అలాంటి పాత్ర చేయాలంటే చాలా గట్స్ ఉన్న నటుడు కావాలని, సల్మాన్ ఖాన్‌ను ఈ సినిమా కోసం ఓకే చేశామని చిరు చెప్పుకొచ్చాడు. అయితే సల్మాన్ ఖాన్‌ను ఈ సినిమాలో నటింపజేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చొరవ ఎక్కువగా ఉందని చిరు పేర్కొన్నారు.

Godfather: గాడ్‌ఫాదర్ క్లైమాక్స్.. టాలీవుడ్, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..!

సల్మాన్‌తో తమ ఫ్యామిలీకి ఉన్న సత్సంబంధంతో ఆయన్ను ఈ సినిమాలో నటించాలని చరణ్ అడగగానే, సల్లూ ఓకే చెప్పారని చిరు అన్నారు. ఇక సల్మాన్ ఖాన్ పాత్ర ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా ఉంటుందని ఆయన అన్నారు. కాగా దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు నిజమైన పండగను అందిస్తుందని చిరు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.