Alluri Movie: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’ ఇప్పటికే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, శ్రీవిష్ణు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెచ్చిపోయి నటించాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Alluri Movie: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!

Allu Arjun As Chief Guest For Alluri Movie Pre-Release Event

Alluri Movie: యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’ ఇప్పటికే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, శ్రీవిష్ణు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెచ్చిపోయి నటించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంఛ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Alluri Movie: పోలీస్ డ్రెస్‌లో అదరగొట్టిన ప్రొడ్యూసైర్.. అల్లూరి వినూత్న ప్రమోషన్స్!

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెషన్‌లో సెప్టెంబర్ 18న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.

Alluri Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అల్లూరి!

ఇక ఈ సినిమాను ప్రదీప్ వర్మ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే అల్లూరి థియేటర్స్‌లో ఎంట్రీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.