Allu Arjun : పుష్ప 2 మొదలైంది.. తగ్గేదేలే.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్స్ కి వస్తారు..

ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అని టాలీవుడ్ లో చర్చల మీద చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా అల్లుఅర్జున్ మాట్లాడుతూ..''ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే.. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు..............

Allu Arjun : పుష్ప 2 మొదలైంది.. తగ్గేదేలే.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్స్ కి వస్తారు..

Allu Arjun said that Pushpa 2 Works starts

Allu Arjun :  శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. మొదటిసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు శ్రీ విష్ణు. ఆదివారం సాయంత్రం అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అల్లు అర్జున్ దీనికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి, సినిమా థియేటర్ల గురించి మాట్లాడారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”నేను పుష్ప 2 సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాను. నా మైండ్ అంతా ఆ సినిమా గురించే ఉంది. ఇలాంటి టైంలో బయట ఈవెంట్స్ కి వెళ్లకూడదనుకున్నాను. కానీ శ్రీ విష్ణు కోసమే వచ్చాను. పుష్ప 2 సినిమా పనులు జరుగుతున్నాయి. ఈ సారి కూడా పుష్ప 2 తగ్గేదేలే” అని అన్నారు.

Sree Vishnu : ఆక్సిజన్ లేని చోట కూడా అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంది.. అదరగొట్టిన శ్రీ విష్ణు స్పీచ్.. బండ్లన్నని గుర్తు చేశాడుగా..

ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అని టాలీవుడ్ లో చర్చల మీద చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా అల్లుఅర్జున్ మాట్లాడుతూ..”ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే.. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు.. కంటెంట్ బాగుంటే, మంచి సినిమా అయితే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాము. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వస్తారు. అందుకు వారికి ధన్యవాదాలు” అని తెలిపారు. పుష్ప 2 వర్క్ మొదలైందని బన్నీనే డైరెక్ట్ గా చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.