Sree Vishnu : ఆక్సిజన్ లేని చోట కూడా అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంది.. అదరగొట్టిన శ్రీ విష్ణు స్పీచ్.. బండ్లన్నని గుర్తు చేశాడుగా..

Sree Vishnu : ఆక్సిజన్ లేని చోట కూడా అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంది.. అదరగొట్టిన శ్రీ విష్ణు స్పీచ్.. బండ్లన్నని గుర్తు చేశాడుగా..

SreeVishnu Powerfull Speech in Alluri Movie Pre Release Event

Sree Vishnu :  శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు శ్రీ విష్ణు. ఆదివారం సాయంత్రం అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అల్లు అర్జున్ దీనికి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన అందరికి, బన్నీ గారి అభిమానులకి అందరికి వెల్కమ్. ఇంత క్రౌడ్ లో అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. అల్లూరి సినిమాకి ఒక అయిదేళ్ల జర్నీ ఉంది. మావి చాలా చిన్న చిన్న సినిమాలు. ఐదేళ్లు ఒక చిన్న సినిమా కోసం అప్ కమింగ్ డైరెక్టర్ ఆగాడంటే చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి నేనెంత చేయాలో అంతా చేశాను. మనం చాలా పోలీస్ స్టోరీలు చూశాము. ఇందులో చూపించిన చాలా ఇన్సిడెంట్స్ రియల్ గా జరిగినవే. కానీ నా క్యారెక్టర్ మాత్రం ఫిక్షనల్. పోలీసులు మన కోసం చాలా చేశారు. కరోనా టైములో చూశాము వాళ్ళు ఎంత కష్టపడ్డారో.”

”నేను సినిమా ఇండస్ట్రీకి ఖాళీ చేతులతో వచ్చాను. చాలా ట్రైల్స్, చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తున్నా. అలాంటి సమయంలో ఇదే నిర్మాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే చిన్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి రేసుగుర్రం షూటింగ్ జరుగుతుంటే బన్నీ గారు ఫోన్ చేసి నన్ను పిలిపించారు. కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ రోజుని ఇవాళ్టికి కూడా గుర్తుంచుకున్నాను. నన్ను కూర్చోబెట్టి శ్రీ విష్ణు గారు చాలా బాగా చేశారు. మీ కామెడీ టైం బాగుంది. మీకు చాలా సినిమాలు వస్తాయి. తొందరపడి ఏది చేయొద్దు అన్నారు. ఇండస్ట్రీ మారుతుంది, కంటెంట్ ఉన్న సినిమాలే తీయి, లేకపోతే ఖాళీగా ఉండు. నిజంగా మంచి కంటెంట్ సినిమా వస్తే నా దగ్గరికి రా కావాలంటే నీకు ప్రొడ్యూస్ నేను చేస్తా. మిమ్మల్ని చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు ఇండస్ట్రీలో నేను ఉన్నాను. ఏ హెల్ప్ కావాలన్నా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టండి. నేను 24/7 మీకు రెస్పాండ్ అవుతాను అన్నారు బన్నీ. ఆయన అప్పుడు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చారు. మాటలు చెప్పడం అందరికి ఈజీనే. కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అది మన బన్నీకి టన్నులు టన్నులు ఉంది. నేను కంటెంట్ కథలు తీసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగాను, బన్నీ గారిని అడుగుదాం అనుకున్నాను. కానీ నేను కంటెంట్ సినిమా తీసి ఆయన్ని అడగాలి అని ఫిక్స్ అయ్యాను.”

Allu Arjun : పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాను అయినా.. శ్రీ విష్ణు కోసమే ఈవెంట్ కి వచ్చాను.. పుష్ప 2 తగ్గేదేలే..

”అంతలో ఒకరోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఆయనే కాల్ చేయించి సన్నాఫ్ సత్యమూర్తిలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. షూట్ కూడా అయిపోయాక మేనేజర్ వచ్చి బిజీగా ఉన్నాను మీ రెమ్యునరేషన్ చెప్తే ఇస్తాము అన్నారు. కానీ బన్నీ పక్కన చేయడమే కోట్ల విలువ. నేను శబరిమల వెళ్తే చాలా మంది నన్ను చూసి గుర్తుపట్టారు. అడిగితే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చూశామని చెప్పారు. బన్నీకి కేరళలో భీభత్సమైన క్రేజ్. ఆ తర్వాత హిమాలయాల్లో సర్చు అనే ఒక ప్లేస్ కి వెళ్ళా. అక్కడ ఆక్సిజన్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడ ఒక వ్యక్తి నన్ను గుర్తుపట్టి మీరు అల్లుఅర్జున్ తో కలిసి నటించారు కదా అన్నారు. ఆక్సిజన్ లేని చోట కూడా ఆయనకి ఆర్మీ ఉంది. అందరూ ప్లాన్ చేసి, ప్రమోషన్స్ చేసి పాన్ ఇండియా అన్నారు. ఆయన ఇవేమి చేయక్కర్లా ఇక్కడ చేస్తే పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. పుష్పతో అదే అయ్యింది. ఇక్కడ ఫిలింనగర్ లో ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తే అది పాన్ వరల్డ్ అయిపోద్ది. అది ప్రూవ్ అయింది. ఆలు అర్జున్ గారి మీద అభిమానంతో నా ప్రతి సినిమాలో రెండు AA లు ఉండేలా చూసుకున్నాను, ఆ సినిమాలో నా పాత్ర పేరులో కూడా. ఈ సినిమా టైటిల్ లోనే రెండు AAలు లేవు, ఒకటే ఉంది అందుకే అన్నయ్యని పిలిచాను. అది నేను ఆయనకి ఇచ్చే గౌరవం. సినిమా గురించి నేను ఏమి చెప్పనవసరం లేదు. 23న థియేటర్స్ లో చూశాక తగ్గేదేలే అని మీరే అంటారు. సినిమా చూశాక పోలీసులకి సెల్యూట్ కొడతారు” అని చెప్పారు.

చాలా తక్కువగా మాట్లాడే శ్రీవిష్ణు మొదటి సారి ఓ రేంజ్ లో మాట్లాడారు. ఇక అల్లు అర్జున్ ని పొగుడుతూ డైలాగ్స్ మీద డైలాగ్స్ చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ మాట్లాడే విధానం గుర్తొచ్చి సోషల్ మీడియాలో శ్రీ విష్ణుని బండ్లన్నతో పోలుస్తూ కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు.