AmalaPaul : ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది

అమలాపాల్ మాట్లాడుతూ.. ''కెరీర్‌ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. నా కన్నా పెద్ద వయసు, బాగా సీనియర్ హీరోలతో నటించాను. ఆ సమయంలో వాళ్ళతో నటించడానికి చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నటిగా వాళ్లనుంచి.............

AmalaPaul : ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది

AMalapaual wants to quit Movies

 

AmalaPaul :  మలయాళం, తమిళ్ సినిమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బెజవాడ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అమలాపాల్. తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంది ఈ భామ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకప్పుడు తాను సినిమాలు మానెయ్యాలి అనుకున్నాను అని తెలిపింది.

Puri Jagannadh: గాడ్‌ఫాదర్ మూవీలో పూరీ పాత్ర అదేనా?

అమలాపాల్ మాట్లాడుతూ.. ”కెరీర్‌ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. నా కన్నా పెద్ద వయసు, బాగా సీనియర్ హీరోలతో నటించాను. ఆ సమయంలో వాళ్ళతో నటించడానికి చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నటిగా వాళ్లనుంచి చాలా నేర్చుకున్నా. కెరీర్ లో ఒకానొక సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. సినిమా సక్సెస్‌ కోసం పాకులాడుతున్నట్టు అనిపించింది నాకే. అదే సమయంలో మా నాన్న చనిపోయారు. ఆ సంఘటన నన్ను చాలా భాదపెట్టింది. చాలా భయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో సినిమాలు మానేయాలని ఫిక్స్ అయ్యా. వాటన్నిటిని దాటి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎలాగైనా పోరాడాలనుకొని గట్టిగా నిల్చున్నాను” అని తెలిపింది.