Puri Jagannadh: గాడ్‌ఫాదర్ మూవీలో పూరీ పాత్ర అదేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో పూరీ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Puri Jagannadh: గాడ్‌ఫాదర్ మూవీలో పూరీ పాత్ర అదేనా?

Puri Jagannadh Role In Godfather Revealed

Puri Jagannadh: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్ టీజర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

Godfather Teaser: ట్రెండింగ్‌లో దుమ్ములేపుతున్న ‘గాడ్‌ఫాదర్’ టీజర్!

అయితే ఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో పూరీ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గాడ్‌ఫాదర్ టీజర్‌లో పూరీని చూపించకపోవడంతో, ఆయన పాత్ర ఏమై ఉంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పూరీ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Puri Jagannadh : పూరి జగన్నాధ్ పాన్ వరల్డ్ సినిమా…

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరీ గాడ్‌ఫాదర్ మూవీలో తన పాత్రకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో నటుడిగా తొలిసారి కనిపించబోతున్నట్లు పూరీ పేర్కొన్నారు. ఇక తాను ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని పూరీ చెప్పడంతో ఈ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో పూరీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు పూరీ ఫ్యాన్స్‌లోనూ క్రియేట్ అయ్యింది.