Godfather Teaser: ట్రెండింగ్‌లో దుమ్ములేపుతున్న ‘గాడ్‌ఫాదర్’ టీజర్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే జనాల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన సమయం నుండి ఈ టీజర్ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోతుంది.

Godfather Teaser: ట్రెండింగ్‌లో దుమ్ములేపుతున్న ‘గాడ్‌ఫాదర్’ టీజర్!

Godfather Teaser: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే జనాల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో గాడ్‌ఫాదర్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు.

Chiranjeevi Godfather Teaser: గాడ్‌ఫాదర్.. బాసులకే బాసు.. కుమ్మేశాడు!

మెగా ట్రీట్‌గా వచ్చిన ఈ టీజర్ సాలిడ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ టీజర్‌ను పదేపదే చూస్తున్నారు. బాస్ స్వాగ్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ టీజర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్‌గా ఉండటంతో ఈ టీజర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన సమయం నుండి ఈ టీజర్ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోతుంది. మెగాస్టార్ లాస్ట్ మూవీ ఆచార్య నుండి అభిమానులను పూర్తిగా బయటపడేసేందుకే మెగాస్టార్ ఈ తరహాలో ఎంట్రీ ఇచ్చారని అభిమానులు అంటున్నారు.

Godfather To Give A Mega Treat: మెగా ట్రీట్‌ను రెడీ చేస్తోన్న గాడ్‌ఫాదర్..?

ఇక ఈ టీజర్‌లో చిరు లుక్స్‌తో పాటు ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్, సల్మాన్ ఖాన్ పవర్‌ఫుల్ కేమియో మేజర్ అట్రాక్షన్లుగా నిలిచాయి. నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.