Chiranjeevi Godfather Teaser: గాడ్‌ఫాదర్.. బాసులకే బాసు.. కుమ్మేశాడు!

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ట్రీట్ రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఆగస్టు 22న అంగరంగ వైభవంగా జరిపేందుకు మెగా అభిమానులు రెడీ అవుతుండగా, వారికి అదిరిపోయే ట్రీట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

Chiranjeevi Godfather Teaser: గాడ్‌ఫాదర్.. బాసులకే బాసు.. కుమ్మేశాడు!

Chiranjeevi Godfather Teaser Sensation

Updated On : August 21, 2022 / 7:14 PM IST

Chiranjeevi Godfather Teaser: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ట్రీట్ రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఆగస్టు 22న అంగరంగ వైభవంగా జరిపేందుకు మెగా అభిమానులు రెడీ అవుతుండగా, వారికి అదిరిపోయే ట్రీట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మెగాస్టార్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఇరగొట్టేశాడు. ఈ టీజర్‌లో చిరంజీవిని సరికొత్తగా ప్రెజెంట్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Godfather Teaser Time Locked: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. మెగా ట్రీట్‌కు సర్వం సిద్ధం!

ఇక గాడ్‌ఫాదర్ ఓ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు ‘గాడ్‌ఫాదర్’గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. రాజకీయాల చుట్టూ తిరిగే కథలో చిరంజీవి తనదైన మార్క్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మరో ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తున్నాడు.

Godfather Teaser To Be Out: గాడ్‌ఫాదర్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం మరో మేజర్ అసెట్ కానుందని ఈ టీజర్‌తోనే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ మెగా ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని చెప్పాలి. ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఆర్‌బి.చౌదరి, ఎన్‌వి.ప్రసాద్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.