Godfather Teaser Time Locked: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. మెగా ట్రీట్‌కు సర్వం సిద్ధం!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా రెడీ అవుతున్నారు. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా గాడ్‌ఫాదర్ చిత్రం నుండి టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా టీజర్ కోసం అందరూ ఆతృతగా చూస్తున్నారు.కాగా, తాజాగా ఈ టీజర్ ఏ సమయంలో రిలీజ్ కాబోతుందో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది.

Godfather Teaser Time Locked: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. మెగా ట్రీట్‌కు సర్వం సిద్ధం!

Megastar Chiranjeevi Godfather Teaser Time Locked

Updated On : August 20, 2022 / 4:55 PM IST

Godfather Teaser Time Locked: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా రెడీ అవుతున్నారు. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్‌డే ఉండనుంటంతో ఈసారి అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌లు ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరు నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ నుండి రాబోయే అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Godfather Teaser To Be Out: గాడ్‌ఫాదర్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ బర్త్‌డే కానుకగా గాడ్‌ఫాదర్ చిత్రం నుండి టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా టీజర్ కోసం అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఆగస్టు 21న గాడ్‌ఫాదర్ టీజర్ రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కాగా, తాజాగా ఈ టీజర్ ఏ సమయంలో రిలీజ్ కాబోతుందో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది.

Godfather To Give A Mega Treat: మెగా ట్రీట్‌ను రెడీ చేస్తోన్న గాడ్‌ఫాదర్..?

గాడ్‌ఫాదర్ టీజర్‌ను ఆగస్టు 21న సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మెగాస్టార్ బర్త్‌డే సందడి ముందురోజు సాయంత్రమే మొదలు కానుందని అభిమానులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఇక ఈ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా.. బాస్ ఈ టీజర్‌లో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.