Godfather To Give A Mega Treat: మెగా ట్రీట్‌ను రెడీ చేస్తోన్న గాడ్‌ఫాదర్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఓ మెగా ట్రీట్ ఖచ్చితంగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Godfather To Give A Mega Treat: మెగా ట్రీట్‌ను రెడీ చేస్తోన్న గాడ్‌ఫాదర్..?

Godfather To Give A Mega Treat: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫైనల్ స్టేజీకి చేరుకోవడంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను మెగాస్టార్ చిరంజీవి తాజాగా మొదలుపెట్టాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇటీవల ముంబైలో ఈ సినిమా షూటింగ్‌లో చిరు పాల్గొన్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆయనతో కలిసి చిరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇక ఈ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఓ మెగా ట్రీట్ ఖచ్చితంగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!

అందుకే ఈ సినిమా డబ్బింగ్‌ను కూడా మెగాస్టార్ వీలైనంత త్వరగా ముగించేయాలని చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, సత్యదేవ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా దసరా బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి మెగాస్టార్ బర్త్‌డే కానుకగా ఈ సినిమా నుండి ఎలాంటి మెగా ట్రీట్ రాబోతుందో చూడాలి.