Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సోమవారం చిరు లుక్ ను, గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.

Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Godgathar

Updated On : July 5, 2022 / 6:40 AM IST

Godfather first look released: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సోమవారం చిరు లుక్‌ను, గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులు కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో.. పవర్ ఫుల్ లుక్‌లో చిరు కనిపించారు. నల్ల కళ్లద్దాలు ధరించి, వింటేజ్ కారులో నుంచి చిరు దిగిన స్టైల్ చూస్తుంటే మెగా ఫ్యామిలీ అభిమానులకు పండగలాగే అనిపిస్తుంది.

కార్యాలయం బయట వేలాది మంది పార్టీ కార్యకర్తలు చిరు కోసం వేచి ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో వస్తారు. సునీల్ కారు డోర్ తీస్తారు.. చిరు కారు దిగి ఆఫీస్‌లోకి వెళ్లిపోతాడు. చిరు హెయిర్ స్టైల్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. గాడ్ ఫాదర్ అనే టైటిల్ చిరంజీవి వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఫస్ట్ లుక్‌లోసైతం చిరు గెటప్ తన హోదాకు తగ్గవిధంగా కనిపిస్తుంది. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలు. కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం చిరు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకే సారి మూడు చిత్రాలను సెట్స్ మీదకు తెచ్చాడు. అందులో ఓ చిత్రమే గాడ్ ఫాదర్. ఈ సినిమా కోసం మెగా ఫ్యాక్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.