Anupam Kher : బాలీవుడ్ లో డబ్బుల కోసం సినిమాలు తీస్తుంటే సౌత్ లో మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారు..

కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అమ్ముకోవాలని చూస్తున్నారు. కేవలం డబ్బులు సంపాదించాలని మాత్రమే చూస్తున్నారు. దానిపై దృష్టి పెడితే ప్రేక్షకులు తగ్గిపోతారు. ప్రస్తుతం............

Anupam Kher : బాలీవుడ్ లో డబ్బుల కోసం సినిమాలు తీస్తుంటే సౌత్ లో మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారు..

Anupam Kher comments on South Movies

Anupam Kher :  నిఖిల్, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. ఇక కలెక్షన్స్ లో కూడా అదరగొట్టేస్తుంది. ఇప్పటికే 90 కోట్ల కలెక్షన్స్ సాధించి 100 కోట్లకు పరుగులు తీస్తుంది. ఈ సినిమా నార్త్ లో అయితే కేవలం 50 థియేటర్లలో రిలీజ్ అయి మూడు రోజుల్లోనే 1000 కి పైగా థియేటర్లకు పెరిగింది అంటే ఎంత భారీ హిట్ కొట్టిందో అర్ధమవుతుంది.

కార్తికేయ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా ఓ ముఖ్యపాత్రలో కనిపించారు. సినిమాలో చాలా తక్కువ సేపు కనిపించినా ఆయన క్యారెక్టర్ సినిమాని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్ బాలీవుడ్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో అనుపమ్ ఖేర్ కూడా పాల్గొన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు.

RRR Movie : కేరళలో బన్నీ రికార్డుని బద్దలు కొట్టిన ఎన్టీఆర్-రామ్ చరణ్.. మలయాళంలో RRR సినిమాకి అదిరిపోయిన టీఆర్పీ..

కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ”బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అమ్ముకోవాలని చూస్తున్నారు. కేవలం డబ్బులు సంపాదించాలని మాత్రమే చూస్తున్నారు. దానిపై దృష్టి పెడితే ప్రేక్షకులు తగ్గిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అదే జరుగుతోంది. ఒక గొప్ప సినిమాకి స్టార్ స్టేటస్ అవసరం లేదు. స్టార్ స్టేటస్ ని డబ్బులుగా మార్చుకోవాలనుకుంటే థియేటర్లు ఖాళీ అవుతాయి. సౌత్ లో ప్రతి భాషల్లోనూ వారి పరిమితులకు లోబడి, తక్కువ బడ్జెట్స్ తో మంచి సినిమాలని తీస్తున్నారు. ఇక్కడ స్టార్ స్టేటస్, డబ్బుల కోసం సినిమాలు తీస్తుంటే సౌత్ లో మంచి కంటెంట్స్ తో సినిమాలు తీస్తున్నారు” అని బాలీవుడ్ కి చురకలు అంటిస్తూనే సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు.