RRR Movie : కేరళలో బన్నీ రికార్డుని బద్దలు కొట్టిన ఎన్టీఆర్-రామ్ చరణ్.. మలయాళంలో RRR సినిమాకి అదిరిపోయిన టీఆర్పీ..

మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పటివరకు మలయాళంలో అల వైకుంఠపురంలో సినిమా.............

RRR Movie : కేరళలో బన్నీ రికార్డుని బద్దలు కొట్టిన ఎన్టీఆర్-రామ్ చరణ్.. మలయాళంలో RRR సినిమాకి అదిరిపోయిన టీఆర్పీ..

rrr movie

RRR Movie :  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా RRR. ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది RRR. థియేట్రికల్ గా భారీ హిట్ కొట్టడమే కాక ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఓటీటీ ద్వారా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ సినిమా ట్రెండ్ లో నిలిచింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాని అభినందించారు. థియేటర్లో, ఓటీటీలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో కూడా కుమ్మేస్తుంది.

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ఈ సినిమాని టెలివిజన్ లో అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ చేశారు. దీంతో టీవీలో కూడా మంచి టీఆర్పీని సాధించింది RRR సినిమా. తెలుగులో RRR సినిమా 19.62 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అయితే RRR సినిమా మలయాళంలో మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

Tejaswi Madivada : ఆ నటుడు, వాళ్ళ ఫ్యాన్స్ చేసిన టార్చర్ వల్ల నేను తాగుడికి బానిసనయ్యాను.. అందుకే సినిమాలకి దూరమయ్యాను..

మలయాళంలో టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాగా RRR నిలిచింది. మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పటివరకు మలయాళంలో అల వైకుంఠపురంలో సినిమా 11.17 టీఆర్పీ, పుష్ప సినిమా 10.02 టీఆర్పీ సాధించి టీవిలో కూడా బన్నీ టాప్ అనిపించుకున్నాడు. తాజాగా RRR సినిమా బన్నీ రికార్డులని బద్దలుకొట్టి ఏకంగా 13.47 రేటింగ్ సాధించింది. మలయాళం టెలివిజన్ లో తెలుగు డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ టీఆర్పీ సాధించడం ఇదే మొదటిసారి. అందులోనూ అక్కడ పట్టు ఉన్న బన్నీ రికార్డ్ క్రాస్ చేయడంతో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.