Tejaswi Madivada : ఆ నటుడు, వాళ్ళ ఫ్యాన్స్ చేసిన టార్చర్ వల్ల నేను తాగుడికి బానిసనయ్యాను.. అందుకే సినిమాలకి దూరమయ్యాను..

తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. ''బిగ్ బాస్ లో నాతో పాటు పాల్గొన్న కౌశల్, కౌశల్ ఆర్మీ గ్యాంగ్ కారణంగా నేను చాలా మనోవేదనకు గురయ్యాను. నాపై చాలా చెత్తగా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కౌశల్ ఆర్మీ. చెత్త చెత్త మీమ్స్ క్రియేట్ చేసి.............

Tejaswi Madivada : ఆ నటుడు, వాళ్ళ ఫ్యాన్స్ చేసిన టార్చర్ వల్ల నేను తాగుడికి బానిసనయ్యాను.. అందుకే సినిమాలకి దూరమయ్యాను..

tejaswi madivada sensational comments on kaushal manda

Tejaswi Madivada :  సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మడివాడ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. బోల్డ్ పాత్రల్లో నటించి, సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలని పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంది తేజస్వి. బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ తర్వాత ఒక్క సినిమా కూడా చేయకపోవడం విశేషం. దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత ఇటీవలే కమిట్మెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తేజస్వి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వి ఎందుకు సినిమాలకి దూరమయిందో, తను తాగుడికి బానిస అయినట్టు చెప్పి షాకిచ్చింది. వీటన్నిటికీ ఒక నటుడు, అతని ఫ్యాన్స్ కారణం అని తెలిపింది. దీంతో తేజస్వి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చగా మారాయి.

Shalini Pandey : నాకు చేసిన సహాయానికి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాలి.. ఆ రోజు నేను మర్చిపోలేను..

తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. ”బిగ్ బాస్ లో నాతో పాటు పాల్గొన్న కౌశల్, కౌశల్ ఆర్మీ గ్యాంగ్ కారణంగా నేను చాలా మనోవేదనకు గురయ్యాను. నాపై చాలా చెత్తగా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కౌశల్ ఆర్మీ. చెత్త చెత్త మీమ్స్ క్రియేట్ చేసి నానా రచ్చ చేశారు. వీటి వల్ల నేను చాలా బాధపడ్డాను. కౌశల్‌ మండా ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చూపించారు. నన్ను బ్యాడ్ చేస్తూ మెంటల్ గా నా మీద అటాక్ చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చాక కూడా వదల్లేదు. హౌస్ నుంచి బయటకి వచ్చాక ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియాలో లేకుండా వేరే దేశాల్లోకి వెళ్ళిపోయాను. సోషల్ మీడియాలో నా మీద కౌశల్ ఆర్మీ చేసే రచ్చ చూసి ఫ్రస్టేషన్ వచ్చి తాగుడుకు కూడా బానిసయ్యాను. కానీ తర్వాత దాని నుంచి బయటకి వచ్చాను.”

”నాపైన ఇంత చేశారు, వాళ్ళకి ఏమొచ్చింది. పోనీ కౌశల్ కెరీర్ కి ఎంత హెల్ప్ అయింది? అసలు అతను ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడా? కౌశల్ ఆర్మీ చేసిన పనులకి విసిగిపోయి సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయి ఇన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్నాను. కానీ వాళ్ళు ఏదో అన్నారని మన కెరీర్ ని నాశనం చేసుకోలేం కదా. అందుకే ఇటీవల విన్న కథల్లో కమిట్మెంట్ కథ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను” అని తెలిపింది. దీంతో తేజస్వి మడివాడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలకు కౌశల్, అతని ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.