Shalini Pandey : నాకు చేసిన సహాయానికి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాలి.. ఆ రోజు నేను మర్చిపోలేను..

అర్జున్ రెడ్డి సినిమా రిలీజయి అయిదు సంవత్సరాలు అవడంతో హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా గురించి గుర్తు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో.. ''ఆగస్ట్ 25 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉన్న రోజు. ఐదేళ్ల క్రితం నా మొదటి సినిమా.................

Shalini Pandey : నాకు చేసిన సహాయానికి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాలి.. ఆ రోజు నేను మర్చిపోలేను..

Shalini Pandey emotional post on Arjun Reddy

Updated On : August 26, 2022 / 11:08 AM IST

Shalini Pandey :  విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా 2017 ఆగస్టు 25న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది అర్జున్ రెడ్డి సినిమా. ఈ సినిమా విజయ్ ని హీరోగా నిలబెట్టింది. షాలినికి బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చేలా చేసింది. డైరెక్టర్ సందీప్ కి కూడా బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి. ఈ ఒక్క సినిమాతో ఆ చిత్ర యూనిట్ అందరి జాతకాలు మారిపోయాయి. ఆ సినిమా వేరే భాషల్లోకి కూడా రీమేక్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయి అయిదు సంవత్సరాలు అయింది. దీంతో అర్జున్ రెడ్డి సినిమా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Karthikeya 2 : చిన్న సినిమా.. పెద్ద విజయం.. 100 కోట్ల కార్తికేయ 2.. కర్నూల్ లో సెలబ్రేషన్స్..

అర్జున్ రెడ్డి సినిమా రిలీజయి అయిదు సంవత్సరాలు అవడంతో హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా గురించి గుర్తు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో.. ”ఆగస్ట్ 25 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉన్న రోజు. ఐదేళ్ల క్రితం నా మొదటి సినిమా అర్జున్ రెడ్డి ఇదే రోజున రిలీజ్ అయ్యింది. ఆ సినిమా నా జీవితంలో మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది. ప్రీతి అనే పాత్రను నేను చేసినందుకు నాకు ఎంతో మంది అభిమానుల ప్రేమ, ఎన్నో ప్రశంసలు దక్కాయి. ప్రీతి పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అర్జున్ రెడ్డి సినిమాకు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గారికి చాలా థాంక్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. అలాగే నా మొదటి సినిమా ప్రయాణంలో సపోర్ట్ చేసిన మరో వ్యక్తి ఉన్నాడు. అతనితో కలిసి పని చేయడం ఎంతో ఎంజాయ్ చేశాను. అతనెవరో కాదు నా సహ నటుడు విజయ్ దేవరకొండ. విజయ్ అలియాస్ లైగర్ నువ్వు నాకు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్” అని పోస్ట్ చేసింది. అర్జున్ రెడ్డి రిలీజ్ అయినా రోజునే లైగర్ సినిమా రిలీజ్ చేయడం, షాలిని పాండే ఇలా ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)