Avatar 2 : అవతార్ మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ.. థియేటర్‌లోకి వచ్చేసింది. 'అవతార్ - ది వే అఫ్ వాటర్' ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలయింది. దాదాపు 160 దేశాల్లో 52000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సంచలనాలు నెలకొలుపుతుంది. కాగా ఈ సినిమా...

Avatar 2 : అవతార్ మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్..

Avatar 2 beats RRR KGF2 lifetime collections

Avatar 2 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ.. థియేటర్‌లోకి వచ్చేసింది. ‘అవతార్ – ది వే అఫ్ వాటర్’ ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలయింది. దాదాపు 160 దేశాల్లో 52000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సంచలనాలు నెలకొలుపుతుంది. డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తుంది.

Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌తో దుమ్ములేపిన అవతార్-2

కాగా ఈ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందే పైరసీ రూపంలో ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. అయినా సరే అభిమానులు మాత్రం అవతార్‌ని థియేటర్‌లో చూసేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో భారత్‌లో అద్వాన్స్ బుకింగ్స్ లో RRR, KGF-2 లను అధిగమించింది. తాజాగా కలెక్షన్స్ లోను ఈ రెండు సినిమాల లైఫ్‌టైమ్ రికార్డులను ఒక్క రోజులో లేపేసింది. RRR, KGF-2 సినిమాలు రూ.1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడానికి నానా తిప్పలు పడ్డాయి.

అయితే ఈ రికార్డులను అవతార్ కేవలం ఒక్క రోజులో లేపేసింది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు రూ.1500 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఒక్క ఇండియాలోనే మొదటిరోజు రూ.52.5 రాబట్టగా, నెట్ రూ.41 కోట్లగా ఉంది. మరి మునుముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.